నయీంపై 27హత్య కేసులు: అరాచకాలపై సభలో కేసీఆర్ వివరణ
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీంకు సంబంధించి 27 హత్య కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. షాద్‌నగర్ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో నయీంహతమయ్యాడని చెప్పారు. నయీం ఘటనకు సంబంధించి శాసనసభలోజరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.
నయీం ఘటనపై ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించిందని.. దర్యాప్తు కోసం సిట్ నేతృత్వంలో నాలుగు బృందాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజల ఫిర్యాదు ఆధారంగా 174 కేసులు నమోదయ్యాయన్నారు. నయీం ముఠా నేరాల విస్తృతి దృష్ట్యా దర్యాప్తు కొనసాగుతున్నట్లు చెప్పారు.

రాష్ట్రంలో నయీం ముఠా దారుణ చర్యలకు పాల్పడిందని సీఎం కేసీఆర్ అన్నారు. నయీం హతమైన ఘటనా స్థలంలో ఏకే 47, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. నయీం నేర చర్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిందన్నారు. రాష్ర్టంలో నయీం అరాచకాలకు ఎంతో మంది ఇబ్బంది పడ్డారని తెలిపారు.
రెండున్నర దశాబ్దాలుగా నయీం ముఠా ఎన్నో దారుణాలకు పాల్పడిందన్నారు. తమను కాపాడాలని ప్రభుత్వానికి ఎంతో మంది మొర పెట్టుకున్నారని తెలిపారు. దర్యాప్తు కోసం సిట్ నేతృత్వంలోని నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నయీం ముఠా అరాచకాలపై పోలీసులు ఆధారాలు సేకరించారని తెలిపారు. నయీం నేరాలపై రెండు చార్జిషీట్లు వేశాం.. మరో 15 చార్జిషీట్లు తయారవుతున్నాయని చెప్పారు.
చార్జిషీట్లను త్వరలో కోర్టుకు సమర్పిస్తామని ప్రకటించారు. ప్రజల ఫిర్యాదు ఆధారంగా 174 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. నయీం వెయ్యి ఎకరాల భూమి, లక్షా 75 వేల చదరపు గజాల ఇండ్ల స్థలాలను కబ్జా చేశారని పేర్కొన్నారు. పోలీసులు 27 ఇళ్లు, రూ. 2.95 కోట్లు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. నయీం స్థావరాల్లో 21 తుపాకులు, 21 కార్లు, 26 బైక్ లను స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. అరాచక శక్తులను ఎక్కడ ఉన్నా అణిచివేస్తామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications