ఇన్ని కాలేజీలా, ఆ జాబ్స్‌కు కూడా పోటీ పడుతున్నారు: కెసిఆర్, రేవంత్ నిలదీత

రాష్ట్రంలో ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు అవసరమా అని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రశ్నించారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు కూడా ఇంజనీరింగ్ విద్యార్థులు పోటీ పడుతున్నారని ఆయన చెప్పారు.

హైదరాబాద్: భారీ సంఖ్యలో రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు ఉండడాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తప్పు పట్టారు. ఏ రాష్ట్రంలోనైనా 370 ఇంజినీరింగ్‌ కాలేజీలు ఉన్నాయా అని ప్రశ్నించారు. కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఇంజినీరింగ్‌ విద్యార్థులు పోటీ పడుతున్నారని చెప్పారు. బీఈడీ కాలేజీల సంఖ్యను కూడా తగ్గించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

దేశంలో ఎక్కడా లేనన్ని రెసిడెన్షియల్‌ స్కూళ్లు రాష్ట్రంలో ప్రారంభిస్తున్నామని కేసీఆర్‌ అన్నారు. అసెంబ్లీలో ఆయన బుధవారం ప్రసంగించారు. 119 బీసీ రెసిడెన్షియల్‌ స్కూళ్లను త్వరలో ప్రారంభిస్తున్నామని తెలిపారు. విదేశీ విద్య స్కాలర్‌షిప్‌ కింద ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షలు, 300 మంది బీసీ విద్యార్థులకు రూ.20 లక్షల చొప్పున ఇస్తున్నామని అన్నారు. ఇంజినీరింగ్‌ కాలేజీల్లో విజిలెన్స్‌ తనిఖీలతో ఫలితాలు సాధించామని అన్నారు.

ఫీజు రియింబర్స్‌మెంట్ విషయంలో విద్యార్థులకు ఎట్టి పరిస్థితిలో ఇబ్బంది కలగనివ్వమని, దీన్ని యధావిధిగా కొనసాగిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఏడాదికి 2500 కోట్లు అవసరమని, అదే విధంగా విద్యార్థుల సంఖ్యను బట్టి రీయింబర్స్‌మెంట్‌ నిధులు పెంచుతున్నామని అన్నారు. గత సంవత్సరం ఇంకా దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోందని, దాని కోసం 1400 కోట్లు చెల్లించామని కేసీఆర్ తెలిపారు.

KCR opposes the number of engineering colleges

రేవంత్ రెడ్డి నిలదీత

రాష్ట్రంలో విద్యార్దులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ అమలు చేస్తారా, లేదా? అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం అసెంబ్లీలో ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై చర్చలో ఆయన మాట్లాడారు. దళిత, పేద విద్యార్థులకు ప్రభుత్వం సకాలంలో ఫీజులు చెల్లించడంలేదని అంటూ వారు చదువుకోకూడదని ప్రభుత్వం భావిస్తుందా అని ప్రశ్నించారు.

ఫీజులు ఎందుకు చెల్లించడంలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఈ పథకాన్నిప్రభుత్వం కొనసాగిస్తుందా? లేదా? చెప్పాలని, కొనసాగిస్తే ఈ నెలాఖరులోగా రూ. 4,410 కోట్లు బాకాయిలు ఉన్నాయని, ఈ మొత్తం బకాయిలను ఎప్పటిలోగా చెల్లిస్తుందో ప్రభుత్వం విద్యార్థులకు స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+