కవితలా చూస్కుంటా, పెళ్లి చేస్తా: ప్రత్యూషకు కెసిఆర్ పండ్లు (పిక్చర్స్)

హైదరాబాద్: తండ్రి, సవతి తల్లి చేతుల్లో తీవ్రకష్టాలు అనుభవించిన ప్రత్యూషకు అండగా ఉండేందుకు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తొలుత ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళీ, ఆ తర్వాత టిడిపి యువ నేత లోకేష్ సాయం చేస్తామని చెప్పారు. ఇప్పుడు తెలంగాణ సీఎం కెసిఆర్ ప్రత్యూషకు భరోసా ఇచ్చారు.

శనివారం నాడు ఆసుపత్రిలో ప్రత్యూషను కెసిఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ.. నువ్వూ నా బిడ్డవేనని, కవితను చూసుకున్నట్లుగా చూసుకుంటానని, బాగా చదివిస్తానని, మంచి అబ్బాయితో పెళ్లి జరిపిస్తానని ప్రత్యూషకు భరోసా ఇచ్చారు.

ఎవరూ లేరని దిగులు పడవద్దని, నేను ఉన్నానని చెప్పారు. కోలుకున్నాక ఇంటికి తీసుకు వెళ్తానని, హాస్టల్లో ఉంచి చదవిస్తానని చెప్పారు. జరిగిందేదో జరిగిపోయిందని, కష్టాలన్నింటినీ పీడకలలా మర్చిపోవాలన్నారు. కొత్త జీవితం ప్రారంభించాలన్నారు. బాగా చదివి పైకి రావాలన్నారు.

ప్రత్యూష - కెసిఆర్

ప్రత్యూష - కెసిఆర్

ప్రత్యూష బాగోగులన్నింటినీ తాను చూసుకుంటానంటూ హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ బాలిక చికిత్స పొందుతున్న సరూర్ నగర్ పరిధిలోని అవేర్ గ్లోబల్ దవాఖానకు శనివారం సాయంత్రం సతీమణి శోభారాణి, కూతురు కవితతో కలిసి వెళ్లారు.

ప్రత్యూష - కెసిఆర్

ప్రత్యూష - కెసిఆర్

చికిత్స పొందుతున్న ప్రత్యూషను పరామర్శించి, ఎంత ఖర్చయినా నీ ఆరోగ్యం బాగయ్యే వరకు ప్రభుత్వమే చూసుకుంటుందన్నారు. నిన్ను మంచి హాస్టల్‌లో పెట్టి చదివిస్తానని హామీ ఇచ్చారు. పోలీసులను కాపలా పెడతానని, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి నిన్ను చూసుకుంటాడన్నారు.

ప్రత్యూష - కెసిఆర్

ప్రత్యూష - కెసిఆర్

కెసిఆర్ ప్రత్యూషతో దాదాపు అరగంటపాటు మాట్లాడారు. ఇప్పటి వరకూ జరిగిందంతా పీడకలలా మర్చిపోవాలని, జీవితంలో కష్టాలొస్తాయని, వాటిని ఎదుర్కొని నిలబడాలని, ఎప్పుడూ చిరునవ్వుతో జీవించాలని, నీ జీవితం ఇంకా చాలా ఉందని, బాగా చదివి ఉన్నతస్థాయికి ఎదగాలన్నారు.

 ప్రత్యూష - కెసిఆర్

ప్రత్యూష - కెసిఆర్

భవిష్యత్తులో ఎవరికైనా నీలాంటి ఆపద వస్తే ఆదుకునే పరిస్థితుల్లో నువ్వుండాలని, నీకు అండగా నేనుంటానని, ఎంతఖర్చైనా సరే నీ ఆరోగ్యం బాగయ్యేంత వరకూ వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని, నీ చదువు కూడా ప్రభుత్వమే చూసుకుంటుందని చెప్పారు.

 ప్రత్యూష - కెసిఆర్

ప్రత్యూష - కెసిఆర్

మంచి అబ్బాయిని చూసి నా సొంతఖర్చులతో నీ పెళ్లి చేస్తానని, ఇల్లు కట్టించి ఇస్తానని, నాకెవరూ లేరని బాధపడొద్దని, ఎవరో ఏదో చేస్తారని భయపడొద్దని, మా అమ్మాయి కవిత, నీకు తోడుంటదని చెప్పారు. నీకు సీఎం కేసీఆర్‌ ఉన్నాడన్నారు.

 ప్రత్యూష - కెసిఆర్

ప్రత్యూష - కెసిఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యూషకు ధైర్యాన్ని నూరిపోశారు. కుమార్తె కవితను చూపిస్తూ.. ఆమెలాగానే నిన్నుకూడా కుమార్తెలా చూసుకుంటానన్నారు. సీఎం ఆత్మీయతకు చలించిపోయిన ప్రత్యూష ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపింది.

 ప్రత్యూష - కెసిఆర్

ప్రత్యూష - కెసిఆర్

ప్రత్యూషను పరామర్శించిన కేసీఆర్ ఆమెకు పండ్ల బుట్టను అందించారు. చేతి ఖర్చుల కోసం కొంత నగదును కూడా ఇచ్చారు. గ్లోబల్ దవాఖానల మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్రనాథ్‌తోపాటు ప్రత్యూషకు వైద్యం అందిస్తున్న వైద్యులతో సీఎం మాట్లాడారు.

 ప్రత్యూష - కెసిఆర్

ప్రత్యూష - కెసిఆర్

మరో ఆరేడు రోజుల పాటు దవాఖానలో ప్రత్యూషకు చికిత్స అందించాల్సి ఉందన్నారు. దీంతో పూర్తిగా కోలుకున్న తర్వాతే దవాఖాన నుంచి డిశ్చార్జి చేయాలని సీఎం సూచించారు. ప్రత్యూష ఆరోగ్యం, భద్రతా వ్యవహారాలను చూసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు, సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు.

ప్రత్యూష - కెసిఆర్

ప్రత్యూష - కెసిఆర్

అంతకుముందు తనను చిత్రహింసలు పెట్టిన తండ్రి, సవతి తల్లిపై చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌ను ప్రత్యూష కోరారు. వారినుంచి తనకు ప్రాణభయం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+