కేసీఆర్ ఫాంహౌస్ చర్చలు: బాబు మోహన్, ఓదేలుకు బుజ్జగింపు, సురేఖ, దానంపైనా..
Recommended Video

హైదరాబాద్: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఎప్పుడెవరు ఏ పార్టీని వీడి ఏ పార్టీలో చేరతారనే చర్చనీయాంశంగా మారింది. కాగా, టీఆర్ఎస్ విడుదల చేసిన తొలి జాబితాలో గల్లంతైన నేతలను బుజ్జగించే పనిలో పడింది ఆ పార్టీ అధిష్టానం.

బాబు మోహన్, ఓదేలుకు బుజ్జగింపులు
తొలి జాబితాలో తమ పేరు లేకపోవడంతో అసంతృప్తిలో ఉన్న ఆ నేతల రాజకీయ భవిష్యత్తుపై భరోసా ఇస్తున్నారు. తొలి విడత జాబితాలోచోటు దక్కని బాబు మోహన్, నల్లాల ఓదేలును శుక్రవారం కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్‌కు పిలిపించుకుని మాట్లాడారు. రాజకీయ భవిష్యత్తుపై అనుమానం అవసరం లేదని, తాను అండగా ఉంటానని కేసీఆర్ వారికి భరోసా ఇచ్చారు. ఎమ్మెల్సీ కానీ, ఇతర నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు.

కొండా సురేఖ లేదంటే.. సారయ్యకు టికెట్
అలాగే తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో కొండా సురేఖ రాజీనామా చేయనున్నట్లు వార్తలు వస్తుండటంతో ఆమె విషయాన్ని పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆమె పార్టీ వీడితే వరంగల్ తూర్పు స్థానాన్ని బస్వరాజు సారయ్యకు కేటాయించే అవకాశం ఉంది.

కూతురు, కొడుకు కోసం కేకే పట్టు, దానంపైనా చర్చ..
ఇది ఇలా ఉంటే, ఖైరతాబాద్ టికెట్‌ను తన కుమార్తె విజయలక్ష్మికి లేదంటే కుమారుడు విప్లవ్ కుమార్‌కు ఇవ్వాలని కేకే పట్టుబడుతున్నట్లు సమాచారం. దానం నాగేందర్ విషయం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, అభ్యర్థులను ప్రకటించని చొప్పదండి, మల్కాజ్‌గిరి స్థానాలపైనా ఉత్కంఠ కొనసాగుతోంది.

మేడ్చల్, వికారాబాద్ వలస నేతలకే..
ఇక మేడ్చల్, వికారాబాద్ స్థానాలను వలస నేతలకు కేటాయించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, మల్కాజ్‌గిరి టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు విజయశాంతి, ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు, ఎంపీ మల్లారెడ్డి ఆశిస్తున్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications