ఐకానిక్ బిల్డింగ్: దేశంలోనే తొలి అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్(పిక్చర్స్)

హైదరాబాద్: నగరంలో నిర్మించనున్న జంట పోలీస్ టవర్లు(కమాండ్ కంట్రోల్ సెంటర్) తెలంగాణకే తలమాణికం కానున్నాయి. విపత్తు కాలంలో వేగంగా స్పందించేందుకు అత్యాధునిక సాంకేతికతతో రూపొందుతున్న తొలి కమిషనరేట్ ఇదే కావడం విశేషం.

విశ్వనగరంలా హైదరాబాద్ రూపుదిద్దుకోవాలంటే శాంతిభద్రతల పర్యవేక్షణ అంతర్జాతీయ స్థాయిలో ఉండాలన్న లక్ష్యంతో సిఎం కెసిఆర్ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ నిర్మాణ బాధ్యతలను ఉన్నతాధికారులకు అప్పగించారు.

సిఎం ఆలోచనలకు అనుగుణంగా పోలీస్ ఉన్నతాధికారులు జంట టవర్లతో కూడిన కమిషనరేట్‌ను రూపొందించారు. అంతర్జాతీయ సంస్థ ప్రైన్ కూపర్స్‌కు భవన నిర్మాణం, టెండర్ల ఖరారును అప్పగించే బాధ్యతను ఇచ్చారు. నిర్మాణ వ్యయం రూ. 240 కోట్లు అవుతుందని ప్రాథమిక అంచనా. పనులకు నవంబర్ 22న సిఎం కెసిఆర్ భూమి పూజ నిర్వహించనున్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి త్వరలో నిర్మాణ పనులు మొదలు పెట్టనున్నామని కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు.

ఉత్తర అమెరికాలోని మన్‌హాటన్ నగరంలో అత్యంత ప్రముఖ ఎత్తైన జంట టవర్ల భవనం క్రైస్లర్. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్(డబ్ల్యూటిఓ) తర్వాత ఎత్తైన భవనాల జాబితాలో ఇది రెండోది. 85 సంవత్సరాల క్రితం నిర్మాణం పూర్తి చేసుకున్నా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. వాణిజ్య భవనాలు, ప్రైవేటు సంస్థలు, ఫ్లాట్లు కలిపి మొత్తం 77 అంతస్తులున్నాయి. ఉగ్రముప్ప పొంచి ఉన్న అమెరికాలో అత్యంత భద్రమైన భవనాల జాబితాలో ఇది కూడా ఉంది.

కాగా, సరిగ్గా ఇలాంటి భవనం తరహాలోనే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఉండాలని సిఎం కెసిఆర్ పోలీస్ ఉన్నతాధికారులకు సూచించారు. అమెరికా, యూరప్, జపాన్ దేశాలకు గతంలో వెళ్లిన పోలీస్ అధికారులు క్రైస్లర్ భవనాన్ని పోలి ఉండేలా జంటటవర్లతో కమిషనరేట్ ఉండాలని ప్రముఖ నిర్మాణ సంస్థల ప్రతిపాదనలను పోలీస్ ఉన్నతాధికారులు కోరడంతో కొన్ని డిజైన్లను వారు ఇచ్చారు. వీటన్నింటినీ పరిశీలించి ముఖ్యమంత్రి 16-24 అంతస్తులున్న జంటటవర్ల డిజైన్‌కు ఆమోద ముద్రవేశారు.

ఐకానిక్ బిల్డింగ్

దేశంలోనే తొలి అత్యాధునిక పోలీస్ కమిషనరేట్‌గానే కాకుండా ‘ఐకానిక్ బిల్డింగ్'లా ఉండాలని నిర్మాణ సంస్థలు, ఆర్కిటెక్టర్లకు ఉన్నతాధికారులు సూచించారు. పర్యావరణ మిత్రలా భవనం ఉండటానికి ప్రత్యేకమైన నిర్మాణ సామాగ్రిని ఉపయోగించనున్నారు. పచ్చదనం కోసం ప్రత్యేకంగా ల్యాండ్‌స్కేప్‌లను ఏర్పాటు చేయనున్నారు. నీరు, విద్యుత్ పొదుపు, ఘన వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్‌లకు అత్యాధునిక ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు.

నిఘా

హైదరాబాద్‌ను సురక్షితనగరంగా రూపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని హైదరాబాద్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. దేశంలోనే అత్యంత ఆధునికమైన కమాండ్ కంట్రోల్ భవనంలో ఉంటుందని, లక్ష కెమెరాలతో ఇది అనుసంధానమై ఉంటుందని తెలిపారు. వివిధ విభాగాల వారు సిసి కెమెరా నెట్‌వర్క్ ద్వారా వారి నిర్విరామంగా పరిశీలించి, విశ్లేషించేందుకు బృందాలుంటాయని చెప్పారు.

ముఖ్యమంత్రి, హోంమంత్రి సహా ఇతర ఉన్నతాధికారులు సమావేశాలు నిర్వహించేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లున్నాయని తెలిపారు. నగరానికి చెందిన వివిధ శాఖలు సమావేశాలు నిర్వహించేందుకునేందుకు కూడా ప్రత్యేక మీటింగ్ హాల్స్ ఉంటాయన్నారు. అందరూ ఒకే చోటే ఉంటే పనులు వేగంగా పూర్తి కావడమే కాకుండా ప్రజలకు నాణ్యమైన సేవలందుతాయన్నదే తమ ఆశయమని ఇటీవల సిపి మహేందర్ రెడ్డి మీడియాకు తెలిపారు.

ట్విన్ టవర్స్ ఆడిటోరియం

ట్విన్ టవర్స్ ఆడిటోరియం

హైదరాబాద్ నగరంలో నిర్మించనున్న జంట పోలీస్ టవర్లు తెలంగాణకే తలమాణికం కానున్నాయి. విపత్తు కాలంలో వేగంగా స్పందించేందుకు అత్యాధునిక సాంకేతికతతో రూపొందుతున్న తొలి కమిషనరేట్ ఇదే కావడం విశేషం.

ట్విన్ టవర్స్ ఆడిటోరియం

ట్విన్ టవర్స్ ఆడిటోరియం

విశ్వనగరంలా హైదరాబాద్ రూపుదిద్దుకోవాలంటే శాంతిభద్రతల పర్యవేక్షణ అంతర్జాతీయ స్థాయిలో ఉండాలన్న లక్ష్యంతో సిఎం కెసిఆర్ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ నిర్మాణ బాధ్యతలను ఉన్నతాధికారులకు అప్పగించారు.

వాకింగ్ లింక్ బ్రిడ్జ్

వాకింగ్ లింక్ బ్రిడ్జ్

సిఎం ఆలోచనలకు అనుగుణంగా పోలీస్ ఉన్నతాధికారులు జంట టవర్లతో కూడిన కమిషనరేట్‌ను రూపొందించారు.

వాక్ వే

వాక్ వే

అంతర్జాతీయ సంస్థ ప్రైన్ కూపర్స్‌కు భవన నిర్మాణం, టెండర్ల ఖరారును అప్పగించే బాధ్యతను ఇచ్చారు. నిర్మాణ వ్యయం రూ. 240 కోట్లు అవుతుందని ప్రాథమిక అంచనా.

కమాండ్ కంట్రోల్ సెంటర్

కమాండ్ కంట్రోల్ సెంటర్

పనులకు నవంబర్ 22న సిఎం కెసిఆర్ భూమి పూజ నిర్వహించనున్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి త్వరలో నిర్మాణ పనులు మొదలు పెట్టనున్నామని కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు.

కమాండ్ కంట్రోల్ సెంటర్

కమాండ్ కంట్రోల్ సెంటర్

ఉత్తర అమెరికాలోని మన్‌హాటన్ నగరంలో అత్యంత ప్రముఖ ఎత్తైన జంట టవర్ల భవనం క్రైస్లర్. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్(డబ్ల్యూటిఓ) తర్వాత ఎత్తైన భవనాల జాబితాలో ఇది రెండోది.

కమాండ్ కంట్రోల్ సెంటర్

కమాండ్ కంట్రోల్ సెంటర్

85 సంవత్సరాల క్రితం నిర్మాణం పూర్తి చేసుకున్నా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. వాణిజ్య భవనాలు, ప్రైవేటు సంస్థలు, ఫ్లాట్లు కలిపి మొత్తం 77 అంతస్తులున్నాయి. ఉగ్రముప్ప పొంచి ఉన్న అమెరికాలో అత్యంత భద్రమైన భవనాల జాబితాలో ఇది కూడా ఉంది.

కమాండ్ కంట్రోల్ సెంటర్

కమాండ్ కంట్రోల్ సెంటర్

కాగా, సరిగ్గా ఇలాంటి భవనం తరహాలోనే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఉండాలని సిఎం కెసిఆర్ పోలీస్ ఉన్నతాధికారులకు సూచించారు.

ట్విన్ టవర్స్ భవనం

ట్విన్ టవర్స్ భవనం

అమెరికా, యూరప్, జపాన్ దేశాలకు గతంలో వెళ్లిన పోలీస్ అధికారులు క్రైస్లర్ భవనాన్ని పోలి ఉండేలా జంటటవర్లతో కమిషనరేట్ ఉండాలని ప్రముఖ నిర్మాణ సంస్థల ప్రతిపాదనలను పోలీస్ ఉన్నతాధికారులు కోరడంతో కొన్ని డిజైన్లను వారు ఇచ్చారు.

ట్విన్ టవర్స్ భవనం

ట్విన్ టవర్స్ భవనం

వీటన్నింటినీ పరిశీలించి ముఖ్యమంత్రి 16-24 అంతస్తులున్న జంటటవర్ల డిజైన్‌కు ఆమోద ముద్రవేశారు.

ట్విన్ టవర్స్ భవనం

ట్విన్ టవర్స్ భవనం

నగరంలో ప్రమాదంలో ఉన్నవారు, బాధితులు డయల్ 100కు ఫోన్ చేసిన వెంటనే పోలీసులు సాయం చేస్తున్నారు. కొత్త పోలీస్ కమిషనరేట్‌లో ఇందుకు భిన్నంగా సమగ్రమైన డయల్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.

ట్విన్ టవర్స్ భవనం

ట్విన్ టవర్స్ భవనం

పోలీసులు, డయల్ 100 సిబ్బంది ఒకే చోట ఉండటం, ఫోన్ వచ్చిన వెంటనే జిపిఎస్ అనుసంధానం, సిసి కెమెరాలున్న ప్రాంతాలను గుర్తించి బాధితులకు క్షణాల్లో సాంత్వన చేకూర్చేందుకు వీలుగా క్షేత్రస్థాయి పోలీసులకు సమాచారం చేరవేస్తారు.

ట్విన్ టవర్స్ భవనం

ట్విన్ టవర్స్ భవనం

డయల్ 100కు ఫోన్ చేసిన వారి వద్దకు ఎవరు వస్తున్నారు? సదరు అధికారి పేరు, ఫోన్ నెంబర్ ఇస్తారు. కొద్ది సేపటి తర్వాత మళ్లీ బాధితులకు ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం దొరికిందా? అని ప్రశ్నించి.. వారి సమాధానాలను ఫీడ్‌బ్యాక్ రూపంలో భద్రపరుస్తారు.

ట్విన్ టవర్స్ భవనం

ట్విన్ టవర్స్ భవనం

వెంటనే స్పందించని అధికారులపై పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారు. అగ్ని ప్రమాదాలు, భారీ వర్షాలు, ఉగ్రవాద దాడులు, పాత భవనాలు కూలిపోవడం వంటివి జరిగినప్పుడు కమిషనరేట్‌లో విపత్తు స్పందన బృందం వేగంగా స్పందిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+