కండువా కప్పాక.. ఆ ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చిన కేసీఆర్..
హైదరాబాద్ : అధికార పార్టీలోకి ప్రతిపక్ష నేతల వలసలు మళ్లీ జోరందుకోవడంతో.. తెలంగాణలో ఏ ప్రతిపక్ష నేత ఎప్పుడు గులాబీ గూటికి చేరుతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. టీఆర్ఎస్ పార్టీలో తప్ప మరే పార్టీలోను రాజకీయ మనుగడ కష్టమని నేతలు భావిస్తుండడంతో, ప్రతిపక్షాలు ఉనికిని కోల్పోతున్న పరిస్థితి. ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తూ.. ఎన్నిక ఏదైనా ఫలితాన్ని మాత్రం అధికార పార్టీకే ఏకపక్షంగా కట్టబెడుతూ వస్తున్నారు తెలంగాణ జనం.
ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష నేతలంతా వరుసపెట్టి గులాబీ గూటికి చేరుతున్న విషయం తెలిసిందే. కాగా, అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ వ్యవహారాన్ని మంత్రి హరీశ్ రావు, కేటీఆర్ లే చక్కదిద్దుతూ వస్తున్నారు. దీంతో చాలా విషయాలు వీళ్లిద్దరి దగ్గర ఓకె అనిపించుకున్నాకే కేసీఆర్ దాకా వెళ్తున్నాయి. ఇప్పడీ చర్చంతా ఎందుకంటే.. టీఆర్ఎస్ తాజా చేరికల్లో భాగంగా సీపీఐ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రనాయక్ పార్టీలో చేరుతున్నారన్న విషయం అసలు తనకు తెలియదంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది.

మంగళవారం నాడు నల్గొండ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తో పాటు మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్ తో పాటు నల్గొండ జిల్లా దేవరకొండ సీపీఐ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రనాయక్ టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్బంగా ఎమ్మెల్యే రవీంద్రనాయక్ కు పార్టీ కండువా కప్పుతూ మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. రవీంద్ర నాయక్ పార్టీలోకి వస్తున్నారన్న విషయం తనకు తెలియదంటూ వ్యాఖ్యానించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు.
ఎమ్మెల్యే రవీంద్రనాయక్ ని కూడా ఈ పరిణామం కాస్త ఇబ్బంది పెట్టే ఉండొచ్చన వాదనలు వినిపిస్తున్నాయి. అయితే తనకు దృష్టికి రాకపోయినా..! పార్టీలో రవీంద్రనాయక్ చేరిక అద్భతమని కేసీఆర్ ఆయనకు కితాబివ్వడంతో నేతలంతా షాక్ నుంచి తేరుకున్నారన్న చర్చ జరుగుతోంది.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications