వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిబిఐ కేసు: కెసిఆర్ రాజీనామా చేయాలని జీవన్, రమణ డిమాండ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

వరంగల్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో డబ్బుల కోసం పని చేశాడు తప్ప కార్మికుల కోసం పని చేయలేదని తెలంగాణ టిడిపి అధ్యక్షులు ఎల్ రమణ ఆదివారం మండిపడ్డారు.

కేంద్రమంత్రిగా పని చేసిన కాలంలో కెసిఆర్ తీసుకున్న ప్రతి నిర్ణయం పైన సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టిడిపి శాసన సభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర రావు మాట్లాడుతూ... మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి, తిరిగి ఉప ఎన్నికల్లో గెలిచాక మంత్రి పదవి ఇస్తే తమకు అభ్యంతరం లేదన్నారు.

హైదరాబాదు పరిధిలో లక్షల ఓట్లను అక్రమంగా తొలగించారని, ఇందుకు కమిషనర్‌ను బాధ్యుడిని చేస్తూ బదలీ చేశారని ఆరోపించారు.

KCR should resign to his post: L Ramana

కెసిఆర్ రాజీనామా చెయ్: జీవన్ రెడ్డి

సిఎం కెసిఆర్ పైన సిబిఐ విచారణ జరుగుతున్నందున ఆయన తన పదవికి రాజీనామా చేయాలని సిఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణలతో రాజయ్యను తొలగించి ఆరు నెలలు అవుతున్నా ఇప్పటికీ విచారణ ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు.

సహారా ఎయిర్ లైన్స్, ఈపీఎఫ్ దుర్వినియోగానికి పాల్పడిందని పార్లమెంటులోనే చర్చ జరిగిందన్నారు. కెసిఆర్ అహంకారంతోనే వరంగల్ లోకసభ స్థానానికి ఉప ఎన్నికలు వచ్చాయన్నారు. రాష్ట్రంలో ఓ ఒక్క వర్సిటీకి ఉపకులపతులు లేరన్నారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో టిఆర్ఎస్‌ది గోబెల్స్ ప్రచారం అన్నారు.

వరంగల్ ఎన్డీఏ అభ్యర్థిపై చర్చ

వరంగల్ ఉప ఎన్నికకు ఎన్డీయే అభ్యర్థిని బిజెపి ఎన్నికల కమిటీ సోమవారం ప్రకటించనుంది. అభ్యర్థిగా ఎన్నారై దేవయ్య పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. వరంగల్ ఉప ఎన్నికల్లో టిడిపి - బిజెపి అభ్యర్థిగా బిజెపి ఎంపిక చేసిన వ్యక్తి పోటీ చేయనున్నారు.

English summary
Telangana CM KCR should resign as Chief Minister, says TTDP chief L Ramana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X