Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హుజూర్ నగర్ లో కేసీఆర్ వెనకడుగు..! దూసుకెళ్తున్న రేవంత్ రెడ్డి..!!

హైదరాబాద్ : తెలంగాణలో రాజకీయాలు ఎన్నడూ లేని విధంగా ఉత్కంఠను రేపుతున్నాయి. హుజూర్ నగర్ ఉప ఎన్నిక, ఆర్టీసి కార్మికుల సమ్మెతో రాష్ట్రం అట్టుడికి పోతోంది. అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ఆర్టీసి సమ్మెను ప్రతిపక్ష పార్టీలు అస్త్రంగా భావిస్తున్నాయి. అదే సమ్మె అధికార పార్టీకి మత్రం శరాఘాతంలా పరిణమించింది. పైకి కనిపించక పోయినా కార్మికుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, రోజరోజుకూ సమ్మె ఉదృతమవుతున్న తీరు అధికార పార్టీని కలవారికి గురిచేస్తున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఆర్టీసి సమ్మె అంశంలో గవర్నర్ తో పాటు న్యాయ స్థానం జోక్యం చేసుకోవడంతో ప్రభుత్వం ఆత్మ రక్షణలో పడినట్టు తెలుస్తోంది.

హుజూర్ నగర్ లో రేవంత్ రెడ్డి ప్రచారం..! కాంగ్రెస్ లో ఉరకలేస్తున్న జోష్..!!

హుజూర్ నగర్ లో రేవంత్ రెడ్డి ప్రచారం..! కాంగ్రెస్ లో ఉరకలేస్తున్న జోష్..!!

సరిగ్గా ఇవే పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకుని హుజూర్ సగర్ ఉప ఎన్నికలో ఫలితం రాబట్టాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహం రచిస్తోంది. అందులో భాగంగా ప్రచార పర్వం చివరి రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్, మల్కాజి గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ని రంగంలోకి దించింది కాంగ్రెస్ అదిష్టానం. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారంలో రేవంత్ రెడ్డి ప్రభావం తీవ్రంగా ఉండబోయే అవకాశాలు ఉన్నట్టు చర్చ జరుగుతోంది. అదే సమయంలో హుజూర్ నగర్ లో సీఎం చంద్రశేఖర్ రావు తలపెట్టిన బహిరంగ సభ రద్దు కావడం కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అంశంగా ప్రచారం జరుగుతోంది.

 వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి ప్రచారం..! పెద్ద ఎత్తున తరలి వస్తున్న జనం..!!

వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి ప్రచారం..! పెద్ద ఎత్తున తరలి వస్తున్న జనం..!!

ఇదిలా ఉండగా ప్రచారం చివరి రెండు రోజుల రేవంత్ రెడ్డి హుజూర్ నగర్ పర్యటన కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అంశంగా తెలుస్తోంది. అధికార గులాబీ పార్టీపైన, సీఎం నిర్ణయాల పైన రేవంత్ రెడ్డి ప్రసంగాలు తెలంగాణ ప్రజానికాన్ని పెద్ద ఎత్తున ఆకర్షిస్తుంటాయి. ప్రభుత్వం విధానాలపై రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నంత సేపూ జనం మంత్రముగ్దులై పోతుంటారు. అంతటి వాక్చాతుర్యం ఉన్న రేవంత్ రెడ్డిని హుజూర్ నగర్ లో ట్రంప్ కార్ట్ లా వినియోగించుకోవాలని కాంగ్రెస్ అధిస్టానం భావించింది. అందుకు తగ్గట్టుగానే రెండు రోజుల మెరుపులాంటి ప్రచారానికి రూపకల్పన చేసింది టీపిసిసి. రేవంత్ రెడ్డి ప్రచారంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది ఉత్తమ్ పద్మావతికి అనుకూల పవనాలు వీస్తున్నట్టు, హుజూర్ నగర్ ఓటర్ల మైండ్ సెట్ ను రేవంత్ ప్రభావితం చేసినట్టు చర్చ జరుగుతోంది.

 గులాబీ పార్టీని కనికరించని వరుణుడు..!కేసీఆర్ సభ రద్దవడంతో ఢీలా పడ్డ పార్టీ శ్రేణులు..!!

గులాబీ పార్టీని కనికరించని వరుణుడు..!కేసీఆర్ సభ రద్దవడంతో ఢీలా పడ్డ పార్టీ శ్రేణులు..!!

ఇదిలా ఉండగా టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప‌రువు ప్ర‌తిష్టల‌ను కాపాడేది ఈ ఉప ఎన్నికే అనే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఇంత‌టి ముఖ్య‌మైన ఎన్నిక సంద‌ర్భంగా సాగుతున్న‌ ప్రచారంలో చంద్రశేఖర్‌రావు పాల్గొనాల్సిన బహిరంగసభ హుజూర్ నగర్ లో హ‌ఠాత్తుగా ర‌ద్ద‌యింది. బలమైన ఈదురుగాలు, భారీవర్షం కారణంగా స‌భ‌ రద్దయిందని టీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్న‌ప్ప‌టికీ, సోష‌ల్ మీడియాలో మాత్రం మ‌రోర‌కంగా ప్ర‌చారం జ‌రుగుతోంది.
సీఎం చంద్రశేఖర్‌రావు గురువారం మధ్యాహ్నం 2 గంటలకు హుజూర్‌నగర్ బహిరంగసభకు హాజరుకావాల్సి ఉంది. పార్టీ అధినేత హాజరవుతుండటంతో టీఆర్‌ఎస్ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో సభా ప్రాంగణానికి చేరుకున్నారు.

 కేసీఆర్ సభ రద్దవ్వడం వెనక అనేక కారణాలు..! వర్షం కారణం కాదంటున్న గులాబీ నేతలు..!!

కేసీఆర్ సభ రద్దవ్వడం వెనక అనేక కారణాలు..! వర్షం కారణం కాదంటున్న గులాబీ నేతలు..!!

ఐతే చంద్రశేఖర్‌రావు రాక‌కు కాస్త ముందు, మెరుపులతో కూడిన భారీవర్షంతోపాటు పిడుగులు పడే అవకాశం ఉందని ఏవియేషన్ అధికారులు సీఎం హెలికాప్టర్‌కు అనుమతి నిరాకరించడంతో సభ రద్దయినట్టు విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సభా వేదికపై ప్రకటించారు. వాతావ‌ర‌ణం కంటే ఆర్టీసీ స‌మ్మె ముఖ్య‌కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తెలంగాణ మంత్రులను కొన్ని ప్రాంతాల్లో ఇప్ప‌టికే అడ్డుకుంటున్నారు ఉద్యోగులు. మంత్రుల పరిస్థితే తనకు కూడా పునరావృతమవుతుందేమోననే ఆలోచ‌న‌తో చంద్రశేఖర్‌రావు హుజూర్‌న‌గ‌ర్ ప‌ర్య‌ట‌న ర‌ద్దుచేసుకున్నార‌నే గుసగుసలు కూడా వినిపించాయి. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నిరసన సెగ తగులుతుందేమో అనే భయం వెంటాడమే పర్య‌ట‌న‌ ర‌ద్దుకు కార‌ణ‌మ‌ని ప‌లువురు చర్చించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి రోడ్ షోలకు, బహిరంగ సభలకు జనం పెద్ద ఎత్తున హాజరు కావండం గులాబీ శ్రేణుల్లో గుబులు మొదలైనట్టు చర్చ జరుగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+