వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్‌కు ఎందుకా భయం?: ఇంట్లో వాళ్లకు కూడా చెప్పొద్దని ఎంపీలతో..

మృత్యు ముఖంలో ముఖం పెట్టి మరీ తెలంగాణ కల నెరవేర్చిన కేసీఆర్ మొండితనం.. ఒక్క విషయంలో మాత్రం ఇప్పటికీ ధైర్యం చేయలేకపోతోందట.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 'కేసీఆర్ భయపడ్తాడయా.. నాకర్థం కాదు'.. తెలంగాణ విషయంలో మొన్నీమధ్యే అమిత్ షా చెప్పిన లెక్కల్ని చీల్చి చెండాడుతూ తెలంగాణ సీఎం చేసిన వ్యాఖ్యలివి. మాట తీరులో ఎంత పదును ఉంటుందో.. ఆయన వ్యూహాలు, ప్రణాళికలు ప్రత్యర్థులను సైతం అంతే హడలెత్తిస్తాయి.

మృత్యు ముఖంలో ముఖం పెట్టి మరీ తెలంగాణ కల నెరవేర్చిన కేసీఆర్ మొండితనం.. ఒక్క విషయంలో మాత్రం ఇప్పటికీ ధైర్యం చేయలేకపోతోందట. అలా అని అదేదో బ్రహ్మండం బద్దలయ్యే విషయమేమి కాదు. జస్ట్ 'సూది మందు'. అవును.. సీఎం కేసీఆర్ ఇప్పటికీ సూది మందు అంటే జంకుతారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పార్టీ ఎంపీల వద్ద వెల్లడించారు.

kcr suffering from injection phobia? funny comments with mp's

ఇటీవల ఎంపీలతో పిచ్చాపాటిగా మాట్లాడుతున్న సమయంలో.. కేసీఆర్ కంటి ఆపరేషన్ ప్రస్తావన వచ్చిందట. ఇప్పటికే రెండు సార్లు కంటి ఆపరేషన్ కోసం ఢిల్లీ వెళ్లి మరీ.. పని కాకుండానే వచ్చేయడంతో.. ఎంపీలు దీని గురించి ఆరా తీసినట్లు తెలుస్తోంది.

Recommended Video

Revanth Reddy Open Challenge to CM KCR

తొలుత అమెరికా నుంచి వైద్యుడు సకాలంలో రాలేదని ఆపరేషన్ వాయిదా వేసుకున్న ఆయన, రెండో సారి రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ హైదరాబాదు వస్తున్నారని, ఆయనకు సంబంధించిన కార్యక్రమాలు చూడాలంటూ మరోసారి వాయిదా వేసుకున్నారు. అయితే ఇవేవి అసలు కారణాలు కాదని, 'సూది మందు' పట్ల ఉన్న భయమే ఈ వాయిదాల వెనుక కారణమని అసలు నిజం చెప్పారట కేసీఆర్.

సూది మందు భయమంటూ కేసీఆర్ చేసిన సరదా వ్యాఖ్యలతో.. ఎంపీలంతా ఒక్కసారిగా నవ్వినట్లు సమాచారం. అంతేకాదు, ఈ విషయం తమ ఇంట్లోను చెప్పవద్దని, చెప్తే ఇక బలవంతంగానైనా తనకు ఆపరేషన్ చేయిస్తారని నవ్వులు పూయించారట.

English summary
Kcr made funny comments with TRS MP's regarding his eye treatment.KCR said he was suffering from injection phobia
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X