సర్వే లెక్కలు: తెలంగాణలో టీఆర్ఎస్ గెలిచే స్థానాలు ఏమిటో చూడండి
Recommended Video

2019 సార్వత్రిక ఎన్నికలకు సంవత్సరకాలం కంటే తక్కువ సమయం ఉండటంతో అప్పుడే సర్వేల లొల్లి షురూ అయ్యింది. ప్రస్తుతం తాము ఏ పొజిషన్‌లో ఉన్నామో తెలుసుకునేందుకు ప్రధాన రాజకీయపార్టీలు సర్వే ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నాయి. ఇందులో భాగంగానే తెలంగాణలో తమ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో గులాబీ బాస్ కేసీఆర్ ఓ సంస్థతో సర్వే చేయించినట్లు తెలుస్తోంది. కర్నాటక ఎన్నికలకు సంబంధించి సర్వే చేసిన ఆ సంస్థ కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందంటూ రిపోర్ట్ ఇచ్చింది. కానీ ఎన్నికల తర్వాత పిక్చర్ తారుమారైంది. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది.
ఇదే సంస్థకు సర్వే బాధ్యతలు అప్పజెప్పిన కేసీఆర్‌కు తీపి కబురు చెప్పింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ 100 అసెంబ్లీ సీట్లు గెలవడం ఖాయమన్న నివేదికను సీఎం కేసీఆర్ ముందుంచింది. అయితే కర్నాటక ఎన్నికల రిపోర్ట్ తప్పుల తడకగా ఉండటంతో గులాబీ దళపతి మరో సర్వే ఏజెన్సీకి కూడా బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. సర్వే నిర్వహించిన ఈ కొత్త సంస్థ కూడా టీఆర్ఎస్‌కు 100 సీట్లు వస్తాయని తేల్చేసింది.

మరోవైపు పార్లమెంటు సీట్లలో 17 స్థానాలకు గాను 15 స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని చెప్పిన సర్వే... హైదరాబాద్ సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాలు మాత్రం కోల్పోయే అవకాశముందని వెల్లడించింది. అయితే సికింద్రాబాద్‌లో టీఆర్ఎస్ బీజేపీల మధ్య గట్టి పోటీ ఉంటుందని సర్వే లెక్కలు కట్టింది. పాత సర్వే ఏజెన్సీ ఇచ్చిన నివేదిక కొత్త సర్వే ఏజెన్సీ ఇచ్చిన రిపోర్ట్ దాదాపు ఒక్కటిగానే ఉండటంతో టీఆర్ఎస్‌లో జోష్ పెరుగుతోంది. త్వరలోనే కేసీఆర్ ఈ సర్వే వివరాలను వెల్లడిస్తారని ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. సర్వేలెక్కలు, టీఆర్ఎస్ శ్రేణుల జోష్ చూస్తే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకే ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications