కెసిఆర్‌ని పడగొట్టేందుకు కాంగ్రెస్‌తో కలిసేందుకు బాబు సిద్ధమయ్యారా!?

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ముందస్తు ఎన్నికలకు వెళ్లవచ్చుననే వార్తలు రాజకీయవర్గాల్లో కలకలం రేపుతున్నాయి. కెసిఆర్ ఆ ఆలోచన వెనుక ఎన్నోకారణాలు ఉండి ఉంటాయని అంటున్నారు.

అందులో మరో కారణం కూడా వినిపిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఓటుకు నోటు కేసు తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన విషయం తెలిసిందే. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర కూడా అందులో ఉందనే ఆరోపణలు వచ్చాయి.

KCR targets Telugudesam and Chandrababu

దీనిపై కెసిఆర్‌కు పక్కా సమాచారం అందిందని కూడా చెబుతున్నారు. కెసిఆర్ గత ఎన్నికల్లో బొటాబొటి మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి నేతలు వచ్చి చేరారు. అయితే, పాతవారు అసంతృప్తితో ఉన్నారు.

తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చంద్రబాబు అవసరమైతే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడానికి సిద్ధపడ్డట్లు కెసిఆర్‌కు సమాచారం అందిందని, అప్పటి నుంచి ఆయన ప్రతివ్యూహరచనలో నిమగ్నమయ్యారని తెలుస్తోందని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+