పిచ్చోడు గోవర్ధన్, తప్పుడు వ్యాసాలు రాస్తున్నాడు: కెసిఆర్
ఆదిలాబాద్: గోవర్ధన్ అనే ఓ పిచ్చోడు ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుపై రాద్ధాంతం చేస్తున్నాడని, కనీస పరిజ్ఞానం లేకుండా పత్రికలలో తప్పుడు వ్యాసాలు రాస్తున్నాడని, ప్రజలను పక్కతోవ పట్టిస్తున్నాడని జల సాధన సమితి నేత నైనాల గోవర్ధన్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు విరుచుకుపడ్డారు. సభలో అనుచరులతో కలిసి నల్లజెండాలు ప్రదర్శించిన గోవర్ధన్‌ను ఉద్దేశించి ఆయన తీవ్రంగా మండిపడ్డారు
అరుపులు మానండని, లేదంటే మర్యాద ఉండదని, మంచి మాటతో వినకపోతే గుణపాఠం తప్పదని ఆయన హెచ్చరించారు. మీకంటే ఎక్కువ నాకు తెలుసని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి ప్రాంతంలో గూడెం ప్రాజెక్టును ఆదివారం ముఖ్యమంత్రి ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించడానికి సిద్ధమైన సమయంలో నల్లజెండాలు పైకి లేచాయి.

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరానికి తరలించడంపై ఉద్యమం సాగిస్తున్న జలసాధన సమితి నేతలు సభలో నినాదాలు చేశారు. గోవర్ధన్ నాయకత్వంలో నిరసనకు వారు ప్రయత్నించగా.. ఆయనపై కెసిఆర్ పెద్దగా మండిపడ్డారు. జెండాలు చూపేవారికి సంస్కారముందా! బిత్తిరి నినాదాలు ఆపాలని గట్టిగా అన్నారు. ఈ సమయంలో సమితి నేతలు నినాదాలు చేశారు. దీంతో కేసీఆర్ తీవ్ర అసహనానికి గురయ్యారు.
‘మీకు బుద్ధి లేదా! మొదలు జెండాలు దించండి. మీ కథ ఏందో చెప్తా!' అని అన్నారు. ప్రాణహిత ప్రాజెక్టు తరలిస్తే మీకేమిటి? అని ప్రశ్నించారు. దమ్ముంటే వచ్చి తనతో మాట్లాడాలని తీవ్రంగా అన్నారు. జెండాలు ఊపిన సన్నాసులకు తెలివి లేదన్నారు. ఇటువంటి సన్నాసులు ఎంతమంది వచ్చినా తాను భయపడబోనని, గోవర్ధన్‌కు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని కెసిఆర్ అన్నారు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications