మోతె మొక్కు తీర్చుకుంటా: కేసీఆర్ (ఫోటోలు)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని మొట్టమొదటి తీర్మానం చేసిన నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం మోతె గ్రామాన్ని సందర్శించి రుణం తీర్చుకుంటానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. మోతె గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని కేసీఆర్ ఆ గ్రామాస్తులకు మాటిచ్చారు.
మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మోతె గ్రామానికి చెందిన ఎంపీపీ బాలరాజు, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు గంగారెడ్డి, సర్పంచ్ రాజేశ్వర్, గ్రామానికి చెందిన పెద్దలు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు సీఎం కేసీఆర్‌ను కలిశారు.

మోతె రుణం తీర్చుకుంటా: గ్రామస్తులతో కేసీఆర్
తెలంగాణ రాష్ట్రం కోసం మొదట తీర్మానం చేసిన తమ గ్రామానికి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మోతె గ్రామంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

మోతె రుణం తీర్చుకుంటా: గ్రామస్తులతో కేసీఆర్
2001లో కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన సమయంలో మోతె గ్రామస్తులు తెలంగాణ కావాలంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారని, అప్పుడు తాను గ్రామాన్ని సందర్శించి, ఆ ఊరి మట్టితో ముడుపుకట్టానని గుర్తు చేశారు.

మోతె రుణం తీర్చుకుంటా: గ్రామస్తులతో కేసీఆర్
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ గ్రామానికి వెళ్లి ముడుపు విప్పానని చెప్పారు. ఆ గ్రామం ఇచ్చిన స్పూర్తి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి అయిందని చెప్పారు. ఈ నేపథ్యంలో మోతె గ్రామస్తులు సీఎం కేసీఆర్‌ను కలిసి తమ గ్రామానికి రావాలని ఆహ్వానించారు.

మోతె రుణం తీర్చుకుంటా: గ్రామస్తులతో కేసీఆర్
గ్రామాభివృద్ధిపై గ్రామస్తుల సమక్షంలోనే అన్ని విషయాలు చర్చించుకుందామని సీఎం కేసీఆర్ చెప్పారు. గ్రామాభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? రైతుల కోసం ఏమి చేయాలి? అనే విషయాలను అక్కడే మాట్లాడుదామని చెప్పారు.












Click it and Unblock the Notifications