ఇదే డబుల్ బెడ్ రూం ఇల్లు: స్వయంగా పర్యవేక్షిస్తానన్న కెసిఆర్(పిక్చర్స్)
మెదక్: ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి రాష్ర్టానికి ఆదర్శంగా మారాలని, ముఖ్యంగా ఎర్రవల్లి రాష్ర్టానికి ప్రయోగశాలగా మారనుందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్నారు. ఈ రెండు గ్రామాలను అభివృద్ధి చేసుకుని వీటి మాదిరిగానే రాష్ట్రంలోని ప్రతి పల్లె అభివృద్ధి చెందేలా కృషి చేద్దామని పేర్కొన్నారు.
ఆదివారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలంలోని నర్సన్నపేట గ్రామస్థులతో సిఎం కెసిఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సిఎం దత్తత గ్రామాల ఖాతాలో నర్సన్నపేట చేరింది. ఐక్యమత్యంతో కష్టించి పనిచేసే పేరున్న నర్సన్నపేట గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు సభాముఖంగా ప్రకటించారు. అభివృద్ధిలో ఎర్రవల్లిని అందుకోవాలన్నారు.
అభివృద్ధికి డబ్బే ముఖ్యం కాదని, దానికి శక్తియుక్తులు అవసరమని, ఆ శక్తి నర్సన్నపేట ప్రజలకుందని ఉత్సాహాన్ని నింపారు. పట్టుపడితే పని పూర్తయ్యేవరకు విడువ కూడదనే దానికి నిదర్శనం తెలంగాణ రాష్ట్ర సాధనేనని గుర్తుచేశారు. సారవంతమైన భూములు ఇక్కడ ఉన్నందున వ్యవసాయ ఉత్పత్తులకు కొదువ లేదని, అందుకోసం రైతులు ఐక్యమత్యంతో కలిసికట్టుగా ఉంటే అంకాపూర్ వంటి గ్రామాలను మించి అభివృద్ధి సాధించవచ్చన్నారు.
అసెంబ్లీ తరువాత పర్యటించి గ్రామానికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేసుకుందామని స్పష్టం చేశారు. గ్రామంలోని అర్హులందరికీ డబుల్‌బెడ్‌రూం ఇళ్ల్ల నిర్మాణం, సభలు, సమావేశాలకు గ్రామం నడిబొడ్డున సమావేశ మందిరం నిర్మించుకుందామని చెప్పారు.
అలాగే గ్రామం పక్కనుంచి బైపాస్ రోడ్డు నిర్మాణం, విశాలమైన వీధులతో ఇళ్ల నిర్మాణం, పార్కులు, మహిళా భవనాలు, కమ్యూనిటీ భవనాల నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా నివేదికలు తయారు చేయాలని ఓఎస్‌డి హన్మంతరావును ఆదేశించారు.
గ్రామాభివృద్ధికి ప్రజల సహకారంతో ప్రణాళికలు తయారు చేయాలని, అభివృద్ధి కోసం అన్ని వర్గాల వారితో కమిటీలను ఏర్పాటు చేయడంతోపాటు మహిళలకు ప్రాధాన్యత ఉండేలా చూడాలని ఆదేశించారు.
వందశాతం అక్షరాస్యతతో పాటు ఇంటికొక ఉద్యోగి ఉండి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచారని అదే మాదిరిగా ఇక్కడ బ్యాంకుల ఏర్పాటుతో పాటు విత్తనోత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసుకునేలా దృష్టి సారించాలని సూచించారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు గ్రామంలో పర్యటించి భూసార పరీక్షలు చేసి నివేదికలు అందించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
అలాగే గణేష్‌పల్లి నుంచి ఎర్రవల్లి వరకు రోడ్డు వెడల్పు పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం దత్తత గ్రామాల్లో నిర్మించనున్న డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నమూనా ఐప్యాడ్ ద్వారా సిఎం కెసిఆర్ ప్రజలకు చూపించారు.

కెసిఆర్
ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి రాష్ర్టానికి ఆదర్శంగా మారాలని, ముఖ్యంగా ఎర్రవల్లి రాష్ర్టానికి ప్రయోగశాలగా మారనుందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్నారు.

కెసిఆర్
ఈ రెండు గ్రామాలను అభివృద్ధి చేసుకుని వీటి మాదిరిగానే రాష్ట్రంలోని ప్రతి పల్లె అభివృద్ధి చెందేలా కృషి చేద్దామని పేర్కొన్నారు.

కెసిఆర్
ఆదివారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలంలోని నర్సన్నపేట గ్రామస్థులతో సిఎం కెసిఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సిఎం దత్తత గ్రామాల ఖాతాలో నర్సన్నపేట చేరింది.

కెసిఆర్
ఐక్యమత్యంతో కష్టించి పనిచేసే పేరున్న నర్సన్నపేట గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు సభాముఖంగా ప్రకటించారు. అభివృద్ధిలో ఎర్రవల్లిని అందుకోవాలన్నారు.

కెసిఆర్
అభివృద్ధికి డబ్బే ముఖ్యం కాదని, దానికి శక్తియుక్తులు అవసరమని, ఆ శక్తి నర్సన్నపేట ప్రజలకుందని ఉత్సాహాన్ని నింపారు. పట్టుపడితే పని పూర్తయ్యేవరకు విడువ కూడదనే దానికి నిదర్శనం తెలంగాణ రాష్ట్ర సాధనేనని గుర్తుచేశారు.

కెసిఆర్
సారవంతమైన భూములు ఇక్కడ ఉన్నందున వ్యవసాయ ఉత్పత్తులకు కొదువ లేదని, అందుకోసం రైతులు ఐక్యమత్యంతో కలిసికట్టుగా ఉంటే అంకాపూర్ వంటి గ్రామాలను మించి అభివృద్ధి సాధించవచ్చన్నారు.

కెసిఆర్
గ్రామంలోని అర్హులందరికీ డబుల్‌బెడ్‌రూం ఇళ్ల్ల నిర్మాణం, సభలు, సమావేశాలకు గ్రామం నడిబొడ్డున సమావేశ మందిరం నిర్మించుకుందామని చెప్పారు.












Click it and Unblock the Notifications