సహపంక్తి భోజనం: పారపట్టి, తట్ట మోసిన కెసిఆర్ (పిక్చర్స్)
సంగారెడ్డి: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మెదక్ జిల్లా ఎర్రవల్లి గ్రామంలో ప్రజలతో భుజం భుజం కలిపి శ్రమదానం చేశారు. చెత్త పోశారు. పార పట్టారు, తట్ట మోశారు. శుక్రవారం ఆయన ప్రజలతో కలిసి పని చేశారు.
శుక్రవాం ఉదయాన్నే గ్రామానికి చేరుకున్న సీఎం కేసీఆర్ గ్రామంలోని పురాతన ఇళ్లను కూల్చే కార్యక్రమాన్ని కొబ్బరికాయ కొట్టి, పారతో మట్టిని తవ్వి, తట్టలోకి ఎత్తి ప్రారంభించారు. అనంతరం గ్రామంలో కలియదిరిగారు. మార్గమధ్యలో పలు ఇళ్ల కూల్చివేత పనులను పరిశీలించారు.
మధ్యాహ్నం గ్రామంలోని ఓ ఇంట్లో విశ్రాంతి తీసుకున్న కెసిఆర్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్, జేసీ వెంకట్రాంరెడ్డిలతో గ్రామాభివృద్ధిపై చర్చించారు. అనంతరం గ్రామస్థులతో కలసి సహపంక్తి భోజనం చేశారు. భోజనమయ్యాక సీఎం దాదాపు మూడు గంటల పాటు విశ్రాంతి తీసుకున్నారు.

గ్రామం గురించి కెసిఆర్...
శుక్రవారం సాయంత్రం పూట గ్రామజ్యోతి గ్రామసభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధికి కలసి వచ్చిన దాతలను సీఎం సన్మానించారు.

మళ్లీ వస్తా..
సెప్టెంబర్ మొదటి వారంలో మళ్లీ ఎర్రవల్లి గ్రామానికి వస్తానని, అప్పుడు ఇళ్ల నిర్మాణానికి మంజూరు ఇవ్వడమే కాకుండా, పనులను ప్రారంభించుకుందామన్నారు.

కలిసి పనిచేద్దాం..
తెలంగాణ పల్లెల్లో పేదరికాన్ని, చెత్తను నిర్మూలించేందుకు యుద్ధం చేద్దామని కెసిఆర్ చెప్పారు ఈ కార్యక్రమాన్ని ఎర్రవల్లి నుంచే ప్రారంభిద్దామని కేసీఆర్ గ్రామస్థులకు పిలుపునిచ్చారు.

ఊరిలో వెలుగులు నింపుతాం..
శుక్రవారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలో గ్రామజ్యోతి సభలో కెసిఆర్ మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఓ ఊరిలో వెలుగు నింపుతానన్నారు. చెత్త ఊరికి దరిద్రమని, ఊరిని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

అందరి దృష్టి పడే విధంగా..
వచ్చే రెండేళ్లలో అందరూ ఎర్రవల్లిలో బతుకుదామనేలా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని కెసిఆర్ చెప్పారు. గ్రామంలోపాడుబడిన ఇళ్లను కూలగొట్టి కొత్త ఇళ్లు కట్టిస్తామని, ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించి ఇస్తానన్నారు.

రెండు పడకల ఇళ్లు..
నాలుగు నెలల్లో అందరికీ రెండు పడక గదుల ఇల్లు కట్టిస్తామని, ఊరిలో ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండేలా చూస్తానన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పూర్తిచేసుకున్న రోజే ఎర్రవల్లికి నిజమైన పండుగ రోజన్నారు.

టీవీల్లో ఇలా..
గురువారం తాను మాట్లాడిన మాటలు టీవీల్లో, పత్రికల్లో చూసి కొందరు ఎర్రవల్లి గ్రామస్థులు తమ గ్రామాన్ని బాగు చేసుకొనేందుకు ముందుకు వచ్చారని, ఈ స్ఫూర్తి ఇలాగే కొనసాగాలని ఉత్సాహపరిచారు.

గోదావరి నీళ్లు తెస్తా..
ఐదారు నెలల్లో గ్రామానికి గోదావరి నీళ్లు తీసుకొస్తామని కెసిఆర్ చెప్పారు. గ్రామంలో కల్యాణ మండపం ఏర్పాటు చేస్తామని చెప్పారు.

హైదరాబాదును మరిపించేలా..
హైదరాబాద్‌లో ఉన్న చౌరస్తాలను మరిపించేలా గ్రామంలో చౌరస్తాలను తీర్చిదిద్దుతామని కెసిఆర్ చెప్పారు. ఇది ఇంతటితో ఒడిసే ముచ్చట కాదని, ఇంకా చాలా ఉందని, అన్ని ఒక్కసారే చెబితే ఆగమైతరని వ్యాఖ్యానించారు.

భూమిలేనివారికి ఉపాధి..
గ్రామంలో భూమి లేనివారికి ఉపాధి కల్పిస్తామని కెసిఆర్ హామీ ఇచ్చారు. గ్రామంలో అపశబ్ధం మాటలు బంద్ చేద్దాం. అపశబ్ధం మాట్లాడితే రూ.50లు ఫైన్ వసూలు చేద్దామని అన్నారు.

అక్కడ వినిపిస్తాయా..
బాపనోళ్ల వాడకట్టులో అపశబ్ధం మాటలు వినపడతాయా? అని ప్రశ్నించారు. మంచిగా మాట్లాడుతుంటే మాటలు మంచిగా వస్తాయని, సంస్కారం వంట పడుతుందని ఆయన అన్నారు.

ఎంపి నిధుల నుంచి..
ఎర్రవల్లి గ్రామానికి ఎంపీ ప్రభాకర్‌రెడ్డి నిధుల నుంచి రూ.50 లక్షలు, జిల్లా కలెక్టర్ నిధుల నుంచి రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారని సీఎం చెప్పారు.

విరాళాలూ వచ్చాయి..
ఎర్రవల్లి గ్రామంలో అభివృద్ధి పనులకు పలువురు దాతలు తమ ఇళ్లను, డబ్బును విరాళంగా ఇచ్చారని కెసిఆర్ తెలిపారు.

సహపంక్తి భోజనం
ఊరందరితో కలిసి కెసిఆర్ సహపంక్తి భోజనం చేశారు. అనంతరం గ్రామ చావిడివద్ద ఏర్పాటుచేసిన సభలో గ్రామస్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications