ప్లైట్ దిగి నేరుగా మైహోం అధినేత షష్టిపూర్తికి: కాళ్లుమొక్కిన కెసిఆర్ (పిక్చర్స్)

హైదరాబాద్: మై హోమ్స్ అధినేత, స్వచ్ఛభారత్ అంబాసిడర్ జూపల్లి రామేశ్వర్ రావు, శ్రీకుమారి దంపతుల షష్టిపూర్తి మహోత్సవం ముగింపు కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. పలువురు రాజకీయ, సినీరంగ, ప్రముఖులు కార్యక్రమానికి హాజరై రామేశ్వర్ రావు దంపతులను ఆశీర్వదించారు.

చైనా పర్యటన ముగించుకుని బుధవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్న తెలంగాణ సిఎం కెసిఆర్ నేరుగా షష్టిపూర్తి జరుగుతున్న శ్రీరామనగరంకు వెళ్లారు. బుధవారం రాత్రి హాంకాంగ్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు కేసీఆర్ చేరుకున్నారు.

అక్కడినుంచి నేరుగా ఆయన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని ముచ్చింతల శ్రీరామనగరంలోని చినజీయర్ స్వామి ఆశ్రమానికి రాత్రి 8.45 గంటలకు చేరుకున్నారు. ఇక్కడ జరిగిన రామేశ్వర్ రావు దంపతుల షష్టి పూర్తి ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

రామేశ్వర రావు షష్టిపూర్తి

రామేశ్వర రావు షష్టిపూర్తి

ఆశ్రమానికి చేరుకోగానే చినజీయర్ స్వామికి సీఎం కేసీఆర్ పాదాభివందనం చేశారు. అలాగే అహోబిల జీయర్ స్వామి, దేవనాధ జీయర్ స్వామిల ఆశీర్వాదాలు పొందారు.

రామేశ్వర రావు షష్టిపూర్తి

రామేశ్వర రావు షష్టిపూర్తి

అనంతరం సంగీత కళాకారులు హరిహరన్, శివమణి సంగీత ప్రదర్శనను సీఎం ఆసక్తిగా తిలకించారు. ఆ తర్వాత శివమణిని శాలువ, పూలదండతో సన్మానించారు.

రామేశ్వర రావు షష్టిపూర్తి

రామేశ్వర రావు షష్టిపూర్తి

మధుప్రియ, సూర్యసాయి పాడిన గేయాలు అందరినీ అలరించాయి. వివిధ సాంస్కృతిక ప్రదర్శనలతో మహోత్సవాలు అట్టహాసంగా జరిగాయి.

రామేశ్వర రావు షష్టిపూర్తి

రామేశ్వర రావు షష్టిపూర్తి

చినజీయర్ స్వామి ఆశ్రమంలో సీఎం కేసీఆర్ 25 నిమిషాలు ఉన్నారు. అంతకుముందు మంత్రి కే తారకరామారావు తన తల్లి శోభతోపాటు వచ్చి రామేశ్వర్ రావు దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

రామేశ్వర రావు షష్టిపూర్తి

రామేశ్వర రావు షష్టిపూర్తి

కార్యక్రమంలో చిన్నజీయర్ స్వామి మాట్లాడుతూ... భారతీయ ఆదర్శ కుటుంబవ్యవస్థతోపాటు సామాజికసేవాపరంగా రామేశ్వర రావు స్ఫూర్తిగా నిలిచారన్నారు.

రామేశ్వర రావు షష్టిపూర్తి

రామేశ్వర రావు షష్టిపూర్తి

రామేశ్వర రావు మాట్లాడుతూ... సామాజిక కర్తవ్యంగా తమ సంస్థల ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలకు అన్నివర్గాల నుంచి ప్రోత్సాహం లభిస్తున్నదన్నారు.

రామేశ్వర రావు షష్టిపూర్తి

రామేశ్వర రావు షష్టిపూర్తి

వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, మెగాస్ట్రార్ చిరంజీవి, పురంధేశ్వరి, తెలంగాణ టీడీపీ నేత ఎల్ రమణ, తెలంగాణ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, సుజనా చౌదరి, పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.

రామేశ్వర రావు షష్టిపూర్తి

రామేశ్వర రావు షష్టిపూర్తి

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు, ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్, వివిధ రంగాల ప్రముఖులు కార్యక్రమానికి హాజరై రామేశ్వర్ రావు దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

రామేశ్వర రావు షష్టిపూర్తి

రామేశ్వర రావు షష్టిపూర్తి

శివమణి వివిధ డ్రమ్స్ నపై సృష్టించిన నాదానికి సీఎం కేసీఆర్, చినజీయర్ స్వామి సహా అందరూ పులకించిపోయారు. అంతే, తన మెడలోని మాలను తీసి శివమణి మెడలో వేసి మెచ్చుకున్నారు.

 రామేశ్వర రావు షష్టిపూర్తి

రామేశ్వర రావు షష్టిపూర్తి

శివమణి కోరికపై చిన్నజీయర్ స్వామి కూడా వాయిద్యం వాయించి అలరించారు. ఆహూతులంతా మైమరచి శివమణి సంగీత విభావరిని తిలకించారు. సంగీత విభావరి పూర్తైన తర్వాత శివమణి అందరికీ అభివాదం చేసి, కేసీఆర్‌కు కూడా ప్రణామం చేశారు. పులకించిపోయిన కేసీఆర్, తనను సత్కరించిన మాలను తీసి శివమణి మెడలో వేశారు. అనంతరం తన మెడలో ఉన్న శాలువాను కూడా తీసి శివమణి మెడలో వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+