అల్లు అర్జున్ టీమ్‌లో బిగ్ వికెట్ అరెస్ట్..?!

Allu Arjun: హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కష్టాలు పెరుగుతున్నట్టే కనిపిస్తోంద. ఉచ్చు మరింత గట్టిగా బిగుసుకుంటోంది. ఇప్పటికే మధ్యంతర బెయిల్‌పై ఉన్న ఆయన తాజాగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారణకూ హాజరయ్యారు.

అల్లు అర్జున్‌కు పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ ఉదయం ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఆ సమయంలో ఆయన వెంట తండ్రి అల్లు అరవింద్, మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, కొంతమంది లీగల్ టీమ్ సభ్యులు ఉన్నారు. సుమారు రెండున్నర గంటల పాటు విచారణలో ఉన్నారు.

Key arrest in Allu Arjun sandhya theatre stampede case Bouncer Antony in police custody

హైదరాబాద్ సెంట్రల్ జోన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ అక్షాంశ్ యాదవ్, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రమేష్ కుమార్, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ సీఐ రాజు ఆధ్వర్యలో విచారణ సాగింది. అనంతరం పోలీసులు ఆయనను సంధ్యా థియేటర్‌కు తీసుకెళ్లారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం తరలించినట్లు సమాచారం.

దీని తరువాత అనూహ్య పరిణామాలు సంభవించాయి. విచారణ కొనసాగుతున్న సమయంలోనే అల్లు అర్జున్ బౌన్సర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయన పేరు ఆంటోనీ. బౌన్సర్ల ఆర్గనైజర్‌గా వ్యవహరిస్తోన్నట్లు చెబుతున్నారు. ఇదివరకే ఆయన పేరు ఎఫ్ఐఆర్‌లో చేర్చారు పోలీసులు.

విచారణ సందర్భంగా అల్లు అర్జున్ ఇచ్చిన వివరాల మేరకు ఆంటోనీని అరెస్ట్ చేశారని చెబుతోన్నప్పటికీ.. గురువారమే ఆయనను అదుపులోకి తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. తొక్కిసలాట ఘటనలో ఆయనను పోలీసులు ప్రధాన కారకుడిగా భావిస్తోన్నారని చెబుతున్నారు. సంధ్యా థియేటర్ వద్ద తోపులాట చోటు చేసుకోవడానికి ఆంటోనీ కారణమనే అభిప్రాయాలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+