ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహ నిర్మాణ పనులు షురూ
వినాయక చవితి పండగ వచ్చిందంటే.. తెలుగు రాష్ట్రాల్లో మొదటగా గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ మహా గణపతి. ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహ రూపం, ఎత్తు, లాంటి అంశాలు భక్తుల్లో ఆసక్తిని నెలకొల్పుతాయి. వినాయక చవితికి రెండు నెలలు సమయం ఉండగానే ఖైరతాబాద్ గణనాథుడి విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
సోమవారం ఖైరతాబాద్ గణేశ్ మండలి వినాయక విగ్రహం ఏర్పాటుకు కర్రపూజ నిర్వహించింది. ఈ ఏడాది వినాయక చవితి పురస్కరించుకుని 70 అడుగుల మట్టి విగ్రహం తయారు చేయించాలని కమిటీ నిర్వాహకులు నిర్ణయించారు. ఈ సందర్భంగా భారీ విగ్రహం తయారీకి పూజ చేశారు. ఈ కర్ర పూజ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది 70 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఖైరతాబాద్‌లో పర్యావరణహిత విగ్రహం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. సంప్రదాయం ప్రకారం కర్రపూజ చేసి విగ్రహం ఏర్పాటు ప్రారంభించినట్లు తెలిపారు. గణేశ్ ఉత్సవాలకు ఈ ఏడాది కూడా మంచి ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.
గతంలో కంటే మెరుగ్గా ఉత్సవాలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని దానం నాగేందర్ తెలిపారు. ఈ మేరకు అన్ని విభాగాలను సమాయత్తం చేస్తున్నామన్నారు. రాబోయే రెండు మూడు రోజుల్లో ఉత్సవ కమిటీలతో సమావేశమై చర్చిస్తామన్నారు. వచ్చిన ప్రతి భక్తుడికి ప్రసాదం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు.
కాగా, ప్రతియేటా ఖైరతాబాద్ మహా గణపతి సరికొత్తగా రూపం ధరించి భక్తులకు దర్శనమిస్తుంటారు. తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తోపాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా ఖైరతాబాద్ గణనాథుడి దర్శనానికి వస్తుంటారు. రాజకీయ, సినీ ప్రముఖులు ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం చేసుకుంటారు. ఇక, సామాన్య భక్తులైతే లక్షలాదిగా తరలివచ్చి గణనాయకుడి ఆశీస్సులు తీసుకుంటారు.
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications