వరంగల్-ఖమ్మం, అచ్చంపేట ఎన్నికలు: రోడ్డుపై బైఠాయించిన సండ్ర
వరంగల్: గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పోరేషన్, మహబూబ్ నగర్ జిల్లాలోని అచ్చంపేట నగర పంచాయతీలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వరుస కట్టారు.
గ్రేటర్ వరంగల్‌లో 58 డివిజన్లలో 398 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓటింగ్ కోసం 660 కేంద్రాల్లో 1,011 ఈవీఎంలను ఏర్పాటు చేశారు. ఆరో డివిజన్‌లో అత్యధికంగా పదిహేను మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మూడు డివిజన్లలో కేవలం ముగ్గురు మాత్రమే పోటీలో ఉన్నారు.

ఖమ్మంలో 50 డివిజన్లలో 291 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోలింగ్ కోసం 265 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 25 ప్రాంతాల్లో ఈవీఎంలకు ప్రింటర్లు అమర్చారు. అచ్చంపేట నగర పంచాయతీలో 20 వార్డులకు గాను 57 అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఖమ్మం జిల్లాలో... అధికార పార్టీ దొంగ ఓట్లు వేయిస్తోందంటూ ఖమ్మంలో టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య రోడ్డుపై బైఠాయించారు.












Click it and Unblock the Notifications