హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పక్కా ప్లాన్: క్లిప్‌లతో బెదిరించి, మహిళను కిడ్నాప్ చేసి దోచుకున్నారు

పక్కా పథకంతో మహిళను కిడ్నాప్ చేసి దోచుకున్న గ్యాంగును హైదరాబాదులోని పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. వారు పక్కా ప్లాన్‌తో మహిళను బెదిరించి కిడ్నాప్ చేశారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మహిళను కిడ్నాప్‌చేసి నగదు, బంగారం దోచుకున్న గ్యాంగ్‌ను హైదరాబాదులోని పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ ఎం. వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. పంజాగుట్టలోని ద్వారకాపురి కాలనీలో ఆర్. జయంతి (61) నివాసముంటుంది. ఆమె తండ్రి విజయరంగ నాయుడు ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ మొదటి కమిషనర్‌గా పనిచేశారు.

కాగా, అమెరికాలో కొద్దికాలం తల్లి ఊర్మిళ (82) తో నివసించింది. తల్లికి అనారోగ్యంగా ఉండటంతో తిరిగి హైదరాబాద్‌కు వచ్చి గత ఏడాది గోల్డెన్ ఐ ఇన్వెస్టిగేషన్ అండ్ సెక్యూరిటీ సర్వీస్‌ను స్థ్థాపించింది. ఆ కార్యాలయ వ్యవహారాలు చూసుకునేందుకు జోసఫ్ ఫిలిప్స్ అనే వ్యక్తిని మేనేజర్‌గా నియమించింది. అదే క్రమంలో ఇంట్లో తల్లి ఆరోగ్యం కో సం హోమాలు చేసేది. ఈ అవసరాన్ని ఆసరాగా భా వించిన ఫిలిప్స్ జయంతి పూజలు నిర్వహిస్తున్న క్ర మంలో గోప్యంగా వీడియో చిత్రీకరించాడు.

Kidnap gang arrested in Hyderabad

వీటిని సికింద్రాబాద్ సైనిక్‌పూరిలో నివాసముండే తన స్నేహితులు డి. బ్రహ్మప్రకాశ్, డి. ప్రకాశ్‌బాబులకు చూపించి కిడ్నాప్‌కు స్కెచ్ వేశారు. గత ఏడాది డిసెంబర్ 27న తమ పథకాన్ని అమలు చేశారు. బ్రహ్మప్రకాశ్, ప్రకాశ్ బాబులు టాస్క్‌ఫోర్స్ అధికారులుగా జయంతిని పరిచయం చేసుకొని ఈ వీడియో క్లిప్పింగ్స్‌తో బెదిరించారు. తమ వెంట కారులో చాదర్‌ఘాట్ వరకు తీసుకెళ్లి రూ.50లక్షలు డిమాండ్ చేశారు.

మొదట రూ. 9లక్షలు బేగంపేట హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి ఫిలిప్స్ కూతురు రేచల్ ఖాతాలో, ఆంధ్రాబ్యాంకు నుంచి రూ.1లక్ష ఆన్‌లైన్‌లో భార్య నందితా దుంపాల ఖాతాకు బదిలీ చేయించుకున్నారు. మిగతా రూ.30లక్షలకు ఆరు చెక్కులు, రూ. 10లక్షల విలువైన బంగారాన్ని లా క్కొని వెళ్లిపోయారు.

దీంతో జయంతి పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.4.25 లక్షల నగదు, స్విప్ట్‌కారు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకన్నారు. జోసఫ్ భార్య నందిత, కుమార్తె రేచల్‌ను అరెస్టు చేసినట్లు ఏసీపీ తెలిపారు.

English summary
The gang, kidnapped a woman has been arrested by Punjagutta police of Hyderabad in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X