లేబర్ ఆఫీసర్ కిడ్నాప్ విషాదాంతం: దారుణహత్య, అటవీ ప్రాంతంలో మృతదేహం., నిందితుడు టీఆర్ఎస్ నేత?
ఖమ్మం/భూపాలపల్లి: ఖమ్మంలో కిడ్నాపైన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆనంద్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం ఆనంద్ రెడ్డి అదృశ్యం కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆయన కుటుంబసభ్యులు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నాలుగు బృందాలుగా గాలింపు చేపట్టారు.

భూపాలపల్లి అటవీ ప్రాంతంలో..
కాగా, భూపాలపల్లి జిల్లాలోని రాంపూర్ అటవీ ప్రాంతంలో ఆనంద్ రెడ్డి ఫోన్ సిగ్నల్స్ ఆగిపోయాయి. దీంతో ఆనంద్‌ను హత్య చేసి అక్కడే అటవీ ప్రాంతంలో పడేసినట్లు తెలుస్తోంది. ఆనంద్ రెడ్డిని తీసుకెళ్లిన ప్రదీప్ రెడ్డి అనే కమలాపూర్ టీఆర్ఎస్ నేత హత్య చేసినట్లు ఆరోపణలున్నాయి.

పోలీసుల అదుపులో..
ప్రస్తుతం ప్రదీప్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. అతనితోపాటు మరో ముగ్గురు అనుమానితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆనంద్ రెడ్డి హత్య వెనుక భూ వివాదం, ఇసుక మాఫియా ఉన్నట్లు తెలుస్తోంది.

నాలుగు రోజుల క్రితం కిడ్నాప్..
మార్చి 7న ఆనంద్ రెడ్డి.. తనకు పరిచయం ఉన్న ప్రదీప్ రెడ్డితో కలిసి బయటకు వెళ్లారు. అప్పట్నుంచి ఆయన ఇంటికి రాలేదు. ఈ క్రమంలో ఆనంద్ రెడ్డి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. కాగా, భూపాలపల్లి జిల్లా రాంపూర్ అటవీ ప్రాంతంలో ఆనంద్ రెడ్డి మృతదేహం లభ్యమైనట్లు సమాచారం.

హైదరాబాద్‌లో ప్రదీప్ రెడ్డి కారు.. వాష్ చేసి..
కాగా, ప్రదీప్ రెడ్డి.. సీఐగా విధులు నిర్వహిస్తున్న ప్రతాప్ రెడ్డి సోదరుడని తెలిసింది. ఇది ఇలావుండగా, ఆనంద్ రెడ్డిని కారులో తీసుకెళ్లిన ప్రదీప్ రెడ్డి.. ఆ కారును హైదరాబాద్‌లోని అల్వాల్‌లో ఓ స్నేహితుడి ఇంటి వద్ద పార్క్ చేసినట్లు తెలిసింది. అంతకుముందే ఆ కారును వాష్ చేసినట్లు సమాచారం.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications