సెంట్రల్ జైలుకు హజీపూర్ సైకో కిల్లర్... విచారణ ముగింపు
కొద్ది రోజుల వ్యవధిలోనే ముగ్గురు అభంశుభం తెలియని మైనర్ అమ్మాయిలను పోట్టనబెట్టుకున్న యాదాద్రీ జిల్లా హాజీపూర్ కిల్లర్ శ్రీనివాస రెడ్డి పోలీస్ విచారణ పూర్తయింది. దీంతో ఆరు రోజుల పాటు యాదాద్రి పోలీస్ కస్టడిలో ఉన్న శ్రీనివాస రెడ్డిని నేడు వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు..
సైకో కిల్లర్ శ్రీనివాస రెడ్డి హజీపూర్‌లో ముగ్గురు మైనర్ అమ్మాయిలను హత్యచేయగా మరోకరిని కర్నూల్ జిల్లా లాడ్జ్‌లో హత్య చేసిన సంగతి తెలిసిందే..దీంతో కొద్ది రోజుల క్రితం శ్రీనివాసరెడ్డి చేసిన హత్యలపై రాష్ట్ర్రవ్యాప్తంగా సంచనం రేపింది. ఒక దశలో హజీపూర్ గ్రామస్థులు సైకో శ్రీనివాస రెడ్డి ఇళ్లును సైతం తగులబెట్టారు. దీంతో పోలీసు కస్టడీలో ఉన్న శ్రీనివాస రెడ్డి మొత్తం నాలుగు హత్యలు చేసినట్టు నిర్ధారణకు వచ్చారు.

కాగా శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం బయటపడిన తర్వాత ఆయన ఇంకా ఏమైన హత్యలు చేశాడా అనే అనుమానాలతో పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. అయితే బయటపడ్డ నాలుగు హత్యలు మినహ ఇతర విషయాలు బయటపెట్టలేదని పోలీసులు తెలిపారు.పోలీస్ కస్టడీలో ఉన్నన్ని రోజులు మౌనంగానే ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక కస్టడికి తీసుకున్న పోలీసులు శ్రీనివాస రెడ్డిని స్పాట్‌కు తీసుకెళ్లి విచారణ జరిపారు. అయితే ఉదయం పూట తీసుకెళితే గ్రామస్థులు దాడీ చేసే అవకాశాలు ఉండడంతో రాత్రీపూట తీసుకెళ్లి విచారణ జరిపారు. కాగా పోలీసుల విచారణలో శ్రీనివాస రెడ్డి మాత్రం నోరు ఆ నాలుగు మినహా మిగతా ఎమైన విషయాలపై నోరు విప్పలేదని తెలుస్తోంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications