లైట్ బీర్లు దొరకడం లేదంటూ కలెక్టరేట్‌కు పాదయాత్ర: ఫిర్యాదు

మంచిర్యాల: మద్యం ప్రియుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమకు కావాల్సిన, ఇష్టమైన మద్యం బ్రాండ్ లభించకపోతే వారు ఎందాకైనా వెళ్తారు. తాజాగా, ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. తమకు కావాల్సిన మందు దొరగడం లేదంటూ ఏకంగా కలెక్టరేట్‌లోనే ఫిర్యాదు ఇచ్చాడు తాగుబోతుల సంఘం నాయకుడు. తమకు కింగ్ ఫిషర్ బీర్లు లభించడంలేదంటూ ఫిర్యాదు చేశాడు.

మందుబాబుల దాహార్తి తీర్చే ఆ బీర్లు దొరకడం లేదని.. ఆ జిల్లాలోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లలో కింగ్ ఫిషర్ బీర్లు దొరకడం లేదని కుట్రంగి తరుణ్ అనే యువకుడు జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి ఎక్సైజ్ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఆ బీర్లు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తాగుబోతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడైన తరుణ్ ఆవేదన వ్యక్తం చేశాడు.

kingfisher light beer not available in wine shops and bars A youth complaint to excise officer

బీరు బాధితుల బాధలు తెలుసుకుని తగిన చర్యలు తీసుకోవాలని మంచిర్యాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌కు వినతి పత్రం అందించారు. జిల్లాలోని వైన్స్, బార్లలో కింగ్ ఫిషర్ లైట్ బీర్లు దొరకడం లేదని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎండతీవ్రతలు ఎక్కువగా అవుతున్న క్రమంలో యువకులు, పెద్దలు బీరుతో దాహం తీర్చుకునేందుకు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పుకొచ్చాడు.

అంతేగాక, తమ జిల్లాతోపాటు కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ఆసిఫాబాద్ వంటి జిల్లాల్లో కూడా కింగ్ ఫిషర్ లైట్ బీర్లు లభ్యం కావడం లేదని తరుణ్ పేర్కొన్నాడు. ఈ లైట్ బీర్లు తాగడం వల్ల మత్తు తక్కువ సమయం ఉంటుందని, ఆ తర్వాత తమ పనులను తాము చేసుకోగలమని చెబుతున్నాడు. స్ట్రాంగ్ బీర్లు తాగడంతో కడుపులో మంట, తీవ్రమైన తలనొప్పి, వాంతులు వంటి వస్తున్నాయని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే కింగ్ ఫిషర్ లైట్ బీర్లు అందుబాటులో ఉంచాలని అధికారులను కోరాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+