ఇక ఆట మొదలైంది కేసీఆర్ - 2023లో భాజపాదే అధికారం: కిషన్ రెడ్డి - ఈటల హెచ్చరిక...!!

నీతి..నిజాయితీకి ప్రతిరూపంగా ఈటల రాజేందర్‌ పనిచేశారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అభినందించారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన తర్వాత తొలిసారి భాజపా కార్యాలయానికి విచ్చేసిన ఈటల రాజేందర్‌ను భాజపా శ్రేణులు ఘనంగా సన్మానించారు. హుజూరాబాద్‌ ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు తీసుకొస్తుందన్నారు. ఉప ఎన్నికలో లబ్ధిపొందేందుకే దళితబంధు పథకం తెచ్చారని ఎద్దేవా చేసారు. హనుమకొండలో విజయగర్జన కాదు కల్వకుంట్ల గర్జన పెట్టుకోండంటూ కిషన్ రెడ్డి సూచించారు.

బెదిరింపుల సీడీలు ఉన్నాయంటూ

బెదిరింపుల సీడీలు ఉన్నాయంటూ

కేసీఆర్‌ ఇచ్చే తాయిలాలకు ఆశపడి ఇక్కడి ఎన్నికల కమిషన్ అధికారులు‌..పోలీసులు పనిచేశారని ఆరోపించారు. డీజీపీ గారూ.. పోలీసులు బెదిరించిన ఆడియోలు తన దగ్గర ఉన్నాయంటూ రాజేందర్ చెప్పుకొచ్చారు. తెరాస కండువా కప్పుకుంటే పనులవుతాయని పోలీసులు బెదిరించారన్నారు. ఒక్క ఉప ఎన్నికలో రూ.500 కోట్లు ఖర్చు పెట్టారు.. ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కేసీఆర్‌ నాయకత్వంలో అరిష్టమైన పాలన సాగుతోందని.. 2023లో ప్రజలు తెరాసను పాతరేసి భాజపాను గెలిపిస్తారంటూ ఈటల వ్యాఖ్యానించారు.

ఆత్మగౌరవాన్ని తెలంగాణ కోల్పోదు

ఆత్మగౌరవాన్ని తెలంగాణ కోల్పోదు

తెలంగాణ ఆకలినైనా భరిస్తుంది కానీ ఆత్మగౌరవాన్ని కోల్పోదని రాజేందర్ చెప్పారు. కేసీఆర్‌ ప్రజలను బానిసలుగా చూస్తున్నారన్నారు. ఈ విజయం హుజూరాబాద్‌ ప్రజలకు అంకితమని చెప్పారు. ఇక ఆట మొదలైంది కేసీఆర్‌...అంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు ఎన్నికలు వచ్చినప్పుడే కొత్త పథకాలు గుర్తుకొస్తాయి. ఐటీ హబ్‌ హైదరాబాద్‌లో యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. తెరాస మేనిఫెస్టోను ఎందుకు అమలు చేయలేదు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటా'' అని ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు.

ఆట మొదలైందంటూ కేసీఆర్ కు సవాల్

ఆట మొదలైందంటూ కేసీఆర్ కు సవాల్

దళిత బంధు రాష్ట్రమంతటా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మీరు చేసిన పనికి తెలంగాణ జాతి మొత్తం తలదించు కుంటుందన్నారు. కేసీఆర్ అరిష్ట పాలనను అంతమొందించాలని ప్రజలు చూస్తున్నారన్నారు. ఈటల రాజేందర్‌ తెలంగాణ ఆత్మగౌరవ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. శంకర్‌పల్లి నుంచి భారీ వాహనాలతో ర్యాలీగా హైదరాబాద్‌ గన్‌పార్క్‌ వద్దకు చేరుకున్నారు. గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద ఈటలతో పాటు భాజపా రాష్ట్ర నేతలు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+