ఫోన్ ట్యాపింగ్, ఢిల్లీ లిక్కర్ కేసులో కేసీఆర్, కేటీఆర్‌లకు కిషన్ రెడ్డి సవాల్

ఫోన్ ట్యాపింగ్ కేసు, ఢిల్లీ లిక్కర్ కేసులపై స్పందిస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. మంగళవారం హైదరాబాద్​ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. బీఆర్​ఎస్​ హయాంలో అన్ని రకాల దోపిడీలు జరిగాయని ఆరోపించారు. అబద్ధాలతోనే కేసీఆర్​ రాజకీయాలు నడిపించారని, ప్రజలను మభ్యపెట్టి పదేళ్లు పాలన సాగించారని విమర్శించారు.

ఈ క్రమంలోనే రాష్ట్రంలో గతంలో బీజేపీ నేతల ఫోన్లు ట్యాపింగ్​ చేశారని, ఈ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కేసుపై ఉన్నత స్థాయి దర్యాప్తు, న్యాయ విచారణ చేయాలని కాంగ్రెస్​ ప్రభుత్వానికి కోరారు. పోలీస్ అధికారులు మాఫియాగా ఏర్పడి ఫోన్ ట్యాపింగ్ చేశారని కిషన్ ​రెడ్డి మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్‌పై సమగ్ర విచారణ చేయాలని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Kishan reddy hits out at brs leaders for phone tapping case delhi liquor case

ఫోన్ల ట్యాపింగ్‌కు బాధ్యత గత ముఖ్యమంత్రిదేనని కిషన్ రెడ్డి చెప్పారు. ఫోన్లు ట్యాపింగ్ చేసి, బ్లాక్ మెయిల్‌ చేసి రూ.కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. తమ పార్టీ కార్యాలయంలోని ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తోందన్నారు. ఎన్నికల సమయంలో బీజేపీ అధికారిక అకౌంట్‌ నుంచి డబ్బులు డ్రా చేసుకుని వస్తుంటే ఫోన్ ట్యాపింగ్ చేసి పోలీసులు చుట్టుముట్టారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

ఇది ఇలావుంటే, ఢిల్లీ లిక్కర్ వ్యవహారంలో బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్‌ స్పందించాలని కిషన్​ రెడ్డి డిమాండ్​ చేశారు. కక్ష సాధింపులో భాగంగా కవితను అరెస్టు చేయించిందని ఆరోపిస్తున్నారని.. ఈ విషయంపై బహిరంగ చర్చకు కేసీఆర్ సిద్ధమా? అంటూ సవాల్​ విసిరారు. పార్టీపై చేస్తున్న ఆరోపణలపై తాము స్పందించాల్సి ఉందన్న కిషన్​ రెడ్డి.. కేసీఆర్‌ కుటుంబ అవినీతిని ప్రజల ముందుంచుతామన్నారు.

ఢిల్లీ మద్యం వ్యాపారంలో కవిత జోక్యం చేసుకున్నారా? లేదా? వ్యాపార సంస్థ ఏర్పాటు చేసి బినామీలను పెట్టారా? లేదా? కవిత కనుసన్నల్లో ఢిల్లీ మంత్రులతో చర్చలు జరిపారా? లేదా? ఢిల్లీ మద్యానికి సంబంధించి రూ.కోట్లు చేతులు మారాయా? లేదా? అనే విషయంలో కేసీఆర్‌ స్పందించాలి అని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కవితది అక్రమ అరెస్టు అంటున్న కేటీఆర్.. లిక్కర్ కేసుతో కవితకు ఎలాంటి సంబంధం లేదని నిరూపించగలరా? అని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+