హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాయిల్డ్ రైస్ ఇవ్వబోమన్న కేసీఆర్.. ఇప్పుడు ధర్నాలు చేస్తారా?: డ్రామాలంటూ కిషన్ రెడ్డి నిప్పులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి లేని సమస్యను సృష్టించారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం కేసీఆర్ ఢిల్లీలో ఆందోళన చేపట్టి కేంద్రంపై విమర్శలు చేసిన నేపథ్యంలో కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీలో మంగళవారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వాస్తవాలను వక్రీకరించి కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు రైతులను మోసం చేస్తున్నారన్నారు.

బాయిల్డ్ రైస్ ఇవ్వబోమన్న కేసీఆర్.. ఇప్పుడు ధర్నాలు: కిషన్ రెడ్డి ఫైర్

బాయిల్డ్ రైస్ ఇవ్వబోమన్న కేసీఆర్.. ఇప్పుడు ధర్నాలు: కిషన్ రెడ్డి ఫైర్

బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేంద్రానికి సీఎం కేసీఆర్ రాతపూర్వకంగా తెలిపారా? లేదా? అని ప్రశ్నించారు. బాయిల్డ్ రైస్‌ను ఏ రాష్ట్రంలోనూ వినియోగించడం లేదన్నారు. బాయిల్డ్ రైస్‌ను ఉచితంగా పంచినా.. ప్రజలు తినే పరిస్థితి లేదన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రజల కోణంలోనే బాయిల్డ్ రైస్ సేకరణను ఎఫ్‌సీఐ నిలిపివేసిందన్నారు. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ లేని సమస్యను సృష్టించారని, అంతేగాక, వాస్తవాలను వక్రీకరించి టీఆర్ఎస్ నేతలు ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. గత సీజన్‌లో ఇస్తామన్న బాయిల్డ్‌ రైసును రాష్ట్రం ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. గత సీజన్‌లో ఎఫ్‌సీఐకి 62 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఇస్తామని రాష్ట్రం ఒప్పందం చేసుకుంది. అగ్రిమెంట్‌ ప్రకారమే ఇంకా 8.34 లక్షల టన్నుల బాయిల్డ్‌ రైసును ఇంకా ఎఫ్‌సీఐకి పంపలేదు. ఒప్పందం ప్రకారం పంపాల్సిన బియ్యాన్ని ఎఫ్‌సీఐకి ఇంకా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

ముడి బియ్యం ఇస్తే కేంద్రం తప్పక తీసుకుంటుంది: కిషన్ రెడ్డి

ముడి బియ్యం ఇస్తే కేంద్రం తప్పక తీసుకుంటుంది: కిషన్ రెడ్డి

బాయిల్డ్​ రైస్​ కాకుండా ముడిబియ్యాన్ని ఇస్తే తప్పకుండా తీసుకుంటామంటున్నారు కిషన్​రెడ్డి. ఈ క్రమంలో వచ్చి కొద్దిపాటి నష్టాన్ని రాష్ట్రం భరించలేదా..? అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రజలను అనేక విషయాల్లో సీఎం కేసీఆర్​ తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ఆరోపించారు. ధాన్యాన్ని ఏడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వమే కొంటున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. బాయిల్డ్‌ రైసు కాకుండా ముడి బియ్యం సరఫరా చేస్తే కేంద్రం తీసుకుంటుందని స్పష్టం చేశారు. వడ్లు సేకరించి రా రైస్‌గా ఇస్తే కేంద్రానికి ఏం అభ్యంతరం లేదన్నారు. కేంద్రానికి రా రైసు సరఫరా చేస్తే నూకల రూపంలో కొంత మేర నష్టం రావొచ్చని.. రైతుల కోసం ఆ మాత్రం నష్టాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించలేదా? అని కిషన్​రెడ్డి ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం కిలో రూ.33 చొప్పున బియ్యం సేకరించి మళ్లీ ప్రజలకు రూ.3కే ఇస్తోందని కేంద్రమంత్రి వెల్లడించారు.

కేసీఆర్ దీక్షను రైతులు నమ్మరు, రైతుల కోసం మీరేం చేయరా?: కిషన్ రెడ్డి

కేసీఆర్ దీక్షను రైతులు నమ్మరు, రైతుల కోసం మీరేం చేయరా?: కిషన్ రెడ్డి

కేసీఆర్ దీక్షను రైతులు నమ్మట్లేదన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. రైతుల కోసం టీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలన్న కిషన్ రెడ్డి.. సమస్య పరిష్కారం దిశగా కేసీఆర్ ఆలోచించాలన్నారు. కొనుగోళ్లపై రైతులను మోసం చేస్తున్నారని.. అగ్రిమెంట్ ప్రకారం కేంద్రం చివరి గింజను కూడా కొంటుందన్నారు. ఇప్పటికైనా రబీలో వచ్చిన దిగుబడిని డైరెక్ట్ గా మిల్లు పట్టించి ఇవ్వాలన్నారు. నియమాల ప్రకారం కేంద్రం కూడా కొంత శాతం నూకలు తీసుకుంటుందని.. నియమ, నిబంధనల ప్రకారం 25% నూకలు ఎఫ్‌సీఐ అనుమతిస్తుందని చెప్పారు. ఇవన్నీ పోను మిగిలే నూకలు చాలా తక్కువ ఉంటాయి. ఆ మాత్రం రాష్ట్రం భరించలేదా? కర్ణాటక, ఏపీ సహా ఇతర రాష్ట్రాలు భరిస్తున్నాయన్నారు.
సీఎం కేసీఆర్ వైఖరి, వితండవాదం, విషప్రచారం చాలా విచిత్రంగా ఉందన్నారు. వ్యవసాయ మోటర్లకు కేంద్రం మీటర్లు పెడుతుంది అంటూ నానా హంగామా చేశారని.. మీటర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని రైతులు కూడా అర్ధం చేసుకున్నారని చెప్పారు. తెలంగాణ రైతులకు వందశాతం ఉచితంగా ఎరువులు ఇస్తానన్న కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు.

English summary
Kishan Reddy hits out at cm kcr on paddy procurement issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X