మీ పోలింగ్ స్టేషన్ కనుక్కోవడం ఎంతో సులభం: 'నా ఓటు'ను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి?
Recommended Video

హైదరాబాద్: ఓటరు, పోలింగ్ బూత్ సమాచారం కోసం ఇటీవల 'నా ఓటు' యాప్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీనిని గత గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ సచివాలయంలో ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా దివ్యాంగులు పోలింగ్ కేంద్రాలకు సులువుగా చేరుకునేలా రూపొందించారు.
'నా ఓటు' పేరిట రూపొందించిన ఈ యాప్ ద్వారా ఓటర్ల జాబితాలో పేరు, పోలింగ్ కేంద్ర వివరాలను తెలుసుకోవచ్చు. పోలింగ్ కేంద్రానికి వెళ్లే మార్గం, సౌకర్యాల వివరాలను ఇందులో పొందుపరిచారు. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌పాంలోనూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డు (ఈపీఐసీ) నెంబరును పేరుతో సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు.

'నా ఓటు' యాప్ డౌన్‌లోడ్ చేసి దానిని ఓపెన్ చేసుకోవాలి. అందులో 'సెర్చ్ బై'ని ఓపెన్ చేసి 'ఎపిక్' (EPIC-ఓటరు కార్డు నెంబర్) నెంబర్ టైప్ చేయాలి. ఎపిక్ నెంబర్ టైప్ చేశాక ఆ తర్వాత 'కాప్చా' నెంబర్ టైప్ చేసి, 'సెర్చ్' చేస్తే మీ పేరు, ఎపిక్ నెంబర్, తండ్రి పేరు, వయస్సు, రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం.. తదితర అన్ని వివరాలు వస్తాయి.
కుడివైపు పైన మీ ఎపిక్ నెంబర్ పక్కన ఓ కన్ను గుర్తు వంటిది ఉంటుంది. దానిని క్లిక్ చేస్తే మీ ఓటరు వివరాలు వస్తాయి.
అక్కడే కింద నీలం రంగులో డబ్బాలో (బాక్స్) మీరు ఓటు వేసే పోలింగ్ బూత్ వివరాలు ఉంటాయి. దాని పైన క్లిక్ చేస్తే నేవిగేటర్‌కు వెళ్లి, అక్కడి నుంచి మీ పోలింగ్ బూత్‌కు దారి చూపిస్తుంది. కాగా, 'నా ఓటు' యాప్‌ను ప్లేస్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications