Street Foods:రంజాన్ స్పెషల్ ఫుడ్స్‌కు కేరాఫ్‌గా ఓల్డ్ సిటీ..భయ్యా ఆ టేస్టే వేరు..!

హైదరాబాద్ : రంజాన్ మాసం దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ పవిత్ర మాసం సందర్భంగా అన్ని దారులు హైదరాబాద్ ఓల్డ్ సిటీ వైపే ఉన్నాయి.అంతా ఓల్డ్ సిటీ వైపే ఎందుకున్నాయంటే ఈ మాసంలో హైదరాబాద్‌లో దొరికే వెరైటీ ఫుడ్స్ మళ్లీ మళ్లీ దొరకవు. ముఖ్యంగా చార్మినార్ ప్రాంతంలో దొరికే సలాడ్స్, ఇతరత్ర తినుబండారాలు కేకో కేక అని అనాల్సిందే.

సాధారణంగా హైదరాబాద్ అంటేనే రకరకాల ఆహారాలకు నెలవు. ఇక రంజాన్‌ మాసంలో అయితే అది వేరే లెవెల్‌లో ఉంటుంది. పత్తర్ కా ఘోష్ నుంచి నవాబీ స్టయిల్ హలీమ్ వరకు ఇక్కడ అన్ని నోరూరించే ఫుడ్స్ దర్శనమిస్తాయి. చార్మినార్ తర్వాత ఇక గత ఐదేళ్లుగా చూస్తే టోలీ చౌకీలో కూడా చాలా ఫుడ్ స్టాల్స్ వెలిశాయి. ఈ ప్రాంతం కూడా భోజనప్రియులకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.

నిత్యం రద్దీగా ఉండే ఓల్డ్ సిటీలో రంజాన్ మాసం మరింత రద్దీని పెంచింది. అంతేకాదు రంజాన్ మాసం తర్వాత కూడా పలు ఫుడ్ ఏరియాస్ బిజీగానే కనిపిస్తాయి. రద్దీ తగ్గుతుందని భావించి చాలామంది తొలిసారి ఈ ప్రాంతాలను సందర్శించేందుకు వస్తారు.వీరితో ఇక్కడి స్టాల్స్ అన్నీ చాలా క్రౌడెడ్‌గా మారుతాయి. ఇక రంజాన్ స్పెషల్‌గా మంచి ఆహారాన్ని ఆస్వాదించాలంటే సిటీలో ఈ ప్రాంతాలకు తరలి రావాల్సిందే.

 charminar-food-

మంచి టేస్టీ ఫుడ్‌ను ఆస్వాదించేందుకు ఓల్డ్ సిటీ బెస్ట్ ప్లేస్. అయితే ఓల్డ్ సిటీకి చేరుకోవాలంటే ట్రాఫిక్ ఎక్కవగా ఉంటుంది. అందుకే మీరు నివసించే ప్రాంతాల్లో మెట్రో సదుపాయం ఉంటే మెట్రోలో ప్రయాణించి క్షణాల్లో ఓల్డ్ సిటీకి చేరుకోవచ్చు. ముందుగా ఓల్డ్ సిటీలో పత్తర్ కా ఘోష్ టేస్టే చేయాలంటే అల్ ఫరూజ్ సోనూ కబాబ్ మరియు దీవాన్ హోటల్స్ చాలా ఫేమస్.సోనూ కబాబ్‌లో చికెన్ మటన్ మాత్రమే సర్వ చేస్తుండగా.. దీవాన్ హోటల్‌లో ఘాష్మండీ బీఫ్ వేరియంట్ దొరుకుతుంది

మంచి హలీమ్ కోసం : హలీమ్ లేకుండా రంజాన్ పూర్తి కాదు. అయితే నగరంలో ఎటు చూసినా హలీమ్ సెంటర్లు వెలిశాయి. కానీ నాణ్యమైన టేస్టీ హలీమ్ మాత్రం హోటల్ నయాబ్‌తో పాటు సుభాన్ బేకరీలు అందిస్తున్నాయి. ఇక కెబాబ్స్, డెసర్ట్స్ కోసం తప్పకుండా వెళ్లాల్సిన ప్రాంతం మొజాంజాహీ మార్కెట్.అంతేకాదు టోలీ చౌక్ ప్రాంతంలోని షాగౌస్ రెస్టారెంట్‌కు సమీపంలో కెబాబ్ స్టాల్స్‌లో కూడా టేస్టీ కెబాబ్ లభిస్తుంది.

haleem

డెసర్ట్స్ కోసం : ఇక మంచి డెసర్ట్స్ కావాలంటే హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీకి వెళ్లాల్సిందే. అక్కడ ఉన్న నజీర్ ఫ్రూట్ జ్యూస్ సెంటర్‌‌లో దొరికే డెసర్ట్స్ మామూలుగా ఉండవు. అక్కడ కచ్చితంగా ట్రై చేయాల్సినవి మ్యాంగో మలాయ్,మల్బరీ మలాయ్. నజీర్ ఫ్రూట్ జ్యూస్ సెంటర్ ఒకటి పురాణా హవేలీలో ఉండగా మరొకటి చౌమహల్లా ప్యాలెస్‌కు సమీపంలో ఉంది. ఒకవేళ చార్మినార్‌కు దగ్గరగా ఉన్నట్లయితే మాథ్‌వాలే దూద్ ఘర్‌లో సమ్మర్ స్పెషల్ లస్సీని తప్పక ట్రై చేయండి. ఇక నగరానికి మరోవైపు ఉన్నవారు టోలీచౌకీ సికింద్రాబాద్‌లోని నైస్ ఫ్రూట్ జ్యూస్‌ సెంటర్‌ను విజిట్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+