ఒక్క ఎస్సెమ్మెస్ తో వాహన రిజిస్ట్రేషన్ వివరాలు తెలుసుకోవచ్చు

ఒక్క నంబర్ కి ఎస్సెమ్మెస్ చేసి వాహనానికి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకోవచ్చు.

హైదరాబాద్: కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు వాహన వినియోగదారులకు సులభమైన, సౌకర్యవంతమైన ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాయి. వాహనం రిజిస్ట్రేషన్ దగ్గరి నుంచి అన్నీ ఆన్ లైన్ లోనే జరుగుతున్నాయి.

అయితే ఇటీవల ఒక ప్రత్యేకమైన, సౌకర్యవంతమైన సేవను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. అదేమిటంటే.. మన మొబైల్ ఫోన్ నుంచి ఒక్క ఎస్సెమ్మెస్ పంపడం ద్వారా వాహనానికి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకోగలగడం.

Know Your Vehicle Details By Sending an SMS

అవును, మీరు చదివింది నిజమే. ఒక్క నంబర్ కి ఎస్సెమ్మెస్ చేసి వాహనానికి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఇందుకు వాహనం యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ ఒక్కటి ఉంటే చాలు. ఇతర పత్రాలేవీ మీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు.

మీరు ప్రయాణిస్తున్న సమయంలో ఎక్కడైనా పోలీసులు ఆపి మీ వాహనం తాలూకు పత్రాలు చూపమని అడిగిన సందర్భంలో మీరు ఒక్క ఎస్సెమ్మెస్ కొడితే చాలు.. మీ వాహనం వివరాలన్నీ మీ మొబైల్ కు చేరిపోతాయి. మీ మొబైల్ నుంచి VAHAN అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ టైప్ చేసి 7738299899 నంబర్ కు ఎస్సెమ్మెస్ పంపించాలి.

మీరు ఇలా ఎస్సెమ్మెస్ పంపించిన కొద్దిసేపటికే మీ మొబైల్ కు మెసేజ్ వస్తుంది. అందులో వాహన యజమాని పేరు, అది ఏ ఆర్టీఏ కార్యాలయానికి చెందినది, ట్యాక్స్ వివరాలు, ఇన్స్యూరెన్స్ వివరాలు, గడువు తేదీలు, ఫైనాన్స్ కంపెనీ వివరాలు ఉంటాయి. ఈ సౌకర్యం కేవలం ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల ప్రజలకు మాత్రమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+