వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి: జనగామలో కోదండరాం

అనేక పోరాలతో సాధించుకున్న జనగామ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు విద్యార్థులు ముందుండి పనిచేయాలని టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు.

|
Google Oneindia TeluguNews

జనగామ: అనేక పోరాలతో సాధించుకున్న జనగామ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు విద్యార్థులు ముందుండి పనిచేయాలని టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. జనగామ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం జనగామ జిల్లా విజయోత్సవ సభ స్థానిక ప్రెస్టన్‌ మైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభకు విద్యార్థి జేఏసీ చైర్మన్‌ ఎండీ అన్వర్‌ అధ్యక్షత వహించగా కోదండరామ్‌ ముఖ్య అతిథిగా హాజరై మ్లాడారు.

జనగామ జిల్లా సాధనలో విద్యార్థుల పాత్ర మహోన్నతంగా నిలిచిందన్నారు. జిల్లా సాధన కోసం శ్రమించిన విద్యార్థులు జిల్లా అభివృద్ధి విషయంలో కూడా పకడ్బందీ ప్రణాళికలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి సమగ్రాభివృద్ధికి కృషి చేయాలన్నారు. జిల్లా ఉద్యమంలో పోరాడిన విద్యార్థులకు ఉపాధి కల్పించే విషయంలో ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందించాలని కోరారు. విద్యార్థి జేఏసీ నాయకులు జిల్లా అభివృద్ధి ప్రణాళికలపై విద్యార్థులను చైతన్యం చేయాలన్నారు.

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాడిన జిల్లాల సమగ్రాభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందరికి దక్కేలా టీజేఏసీ గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఉద్యమిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాల్లో తగిన ప్రాధాన్య కల్పించాలన్నారు. తెలంగాణ సినీ రంగానికి ప్రోత్సాహంగా ఈ ప్రాంత సినీనటులు, చిత్రాలకు అవార్డులు ప్రదానం చేయాలన్నారు. ప్రజలు చైతన్యవంతులై తమ ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని పిలుపునిచ్చారు.

Kodandaram on Janagama development

సభలో ఓయూ ప్రొఫెసర్‌ పురుషోత్తం, ప్రైవేటు విద్యా సంస్థల రాష్ట్ర చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ప్రైవేటు కళాశాలల జిల్లా అధ్యక్షుడు ఆర్‌ బ్రహ్మచారి, ఓయూ జేఏసీ నాయకురాలు బాల లక్ష్మి, విద్యార్థి సంఘాల నాయకులు పిట్టల సురేష్‌, తీగల సిద్ధుగౌడ్‌, గడ్డం దిలీప్‌, శివరాజ్‌, అఫ్రోజ్‌, కిరణ్‌నాయక్‌, చందనారెడ్డి, అజిత్‌, సురేష్‌ అబ్బు పాల్గొన్నారు. సభకు ముందు ఏపూరి సోమన్న కళాకారుల బృందం ఆాపాటలతో అలరించారు. జిల్లా కేంద్రంలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు ర్యాలీగా తరలివచ్చి సభలో పాల్గొన్నారు.

కేసీఆర్‌ పాలనలో విద్యారంగం ధ్వంసం

వరంగల్: కేసీఆర్‌ 30 నెలల పాలనలో రాష్ట్రంలో విద్యారంగం పూర్తిగా ధ్వంసమైపోయిందని తెలుగునాడు విద్యార్థిఫ్రంట్(టీఎన్‌ఎస్‌ఫ్) రాష్ట్ర అధ్యక్షుడు చిలుకా మధుసూదన్‌రెడ్డి విమర్శించారు. డిసెంబర్ 9న వరంగల్‌లో విద్యార్థి పోరుబాటను పురస్కరించుకొని జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించేందుకు బుధవారం ఆయన నగరానికి వచ్చారు.

ఈ సందర్భంగా హన్మకొండ బాలసముద్రంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మధుసూదన్‌రెడ్డి మ్లాడుతూ.. రాష్ట్రంలో ఇంటర్‌, డిగ్రీ ఇంజనీరింగ్‌, వృత్తి విద్యలను అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించలేదన్నారు. సుమారు 15 లక్షల మంది విద్యార్థులకు రూ. 3 వేల కోట్ల వరకు బకాయి పెట్టిందన్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్ రాని కారణంగా ప్రైవేటు కళాశాలల్లో పేద విద్యార్థులు అడ్వాన్సులు కడితేనే అడ్మిషన్లు ఇచ్చే దుస్థితి ఏర్పడిందన్నారు.

టిఆర్‌ఎస్‌ పార్టీ విద్యార్థులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలుకాలేదన్నారు. కేజీ టూ పీజీ, సకాలంలో ఫీజురీయింబర్స్‌మెంట్ చెల్లింపులు, ఏటా లక్ష ఉద్యోగాలు ... ఇలా కేసీఆర్‌ చేసిన అనేక వాగ్దానాలు నీటిమూటలు గానే మిగిలిపోయాయని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర వస్తే తమ బతుకులు బాగుపడతాయని ఆశించిన విద్యార్థులకు చివరికి ఆశాభంగమే కలిగిందన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంనందువల్లనే టిఎన్‌ఎస్‌ ఆధ్వర్యంలో విద్యార్థి పోరుబాటను చేపడుతున్నామన్నారు.

విద్యార్థుల సమస్యలపై డిసెంబర్ 9వ తేదీన విద్యార్థి పోరుబాటలో పూరిస్తున్న ఈ సమరశంఖం అన్ని జిల్లాల్లో మారుమోగుతుందన్నారు. పోరుబాట సందర్భంగా హన్మకొండ పబ్లిక్‌ గార్డెన్‌ నుంచి బాలసముద్రంలోని ఏకశిల పార్క్‌ వరకు జరిగే ర్యాలీ, అనంతరం అక్కడ నిర్వహించే బహిరంగ సభలో విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

పోస్టర్‌ ఆవిష్కరణ

తొలుత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాష్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సీతక్క, ఈగ మల్లేశం, ీడీపీ ఉమ్మడి జిల్లా అధ్యకక్షుడు గండ్ర సత్యనారాయణ రావు, ఇతర జిల్లా నాయకులతో కలిసి విద్యార్థి పోరుబాట పోస్టర్‌ను మధుసూదన్‌రెడ్డి ఆవిష్కరించారు.

English summary
Telangana JAC chairman Kodandaram responded on Janagama development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X