పుకార్లే! నాది, కెసిఆర్‌ది ఒకేదారి: కోదండరాం, ప్రభుత్వంపై ఒత్తిడి తప్పదు

కరీంనగర్: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుతో తనకు ఎలాంటి బేదాభిప్రాయాలు లేవని తెలంగాణ రాజకీయ జేఏసీ(టీజేఏసీ) చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు.ఆదివారం సారంగాపూర్‌ మండలంలోని బీర్‌పూర్‌ రోళ్లవాగు ప్రాజెక్టును ఆయన పరిశీలించారు.

సీఎం ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు పోరాడుతుంటే.. ప్రజల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్తున్నానని కోదండరాం తెలిపారు. తమ ఇద్దరిదీ ఒకే దారి అని కోదండరాం పేర్కొన్నారు. కేసీఆర్ టీఆర్‌ఎస్ పార్టీతో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారని, తాను జేఏసీతో ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు పోరాటం చేశామని గుర్తు చేశారు.

తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్, కోదండరాం మధ్య భేదాభిప్రాయాలున్నాయని చాలా మంది అంటున్నారని, అది కేవలం పుకార్లు మాత్రమేనని కొట్టిపారేశారు. తమ ఇద్దరిదీ ఒకే పంథా అని అన్నారు.

Kodandaram on KCR

జేఏసీలోంచి వివిధ సంఘాలు వారి ఇష్టానుసారంగానే బయటకు వెళ్తున్నాయని తెలిపారు. త్వరలోనే జేఏసీ ప్రత్యేక సమావేశం నిర్వహించి భవిష్యత్ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ప్రస్తుతం తనకు రాజకీయా ల్లో ప్రవేశించాలన్న ఆలోచన లేదని స్పష్టం చేశారు.

అన్నా హజారే వంటి నాయకులు సేవ చేస్తున్నారే తప్ప రాజకీయాల్లోకి వస్తున్నారా? అని ప్రశ్నించారు. కరువు పరిస్థితులపై అధ్యయనం చేసి రైతులకు న్యాయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు.

ప్రస్తుత పరిస్థితులపై ప్రశ్నించేలా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే కరవుపై అధ్యయనం చేస్తున్నట్లు కోదండరాం పేర్కొన్నారు. ఒక్కో రైతు కనీసం రూ. 50వేల వరకు బావులపై పెట్టుబడులు పెట్టినా చుక్క నీరు లేకపోవడమే కాకుండా ఆర్థికంగా నష్టపోతున్నారని అయినా ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించకపోవడం ఆవేదనకు గురిచేస్తుందన్నారు.

మంచినీటి సమస్య గ్రామాల్లో తీవ్రంగా ఉందని మహిళలు పనిమానేసి తాగునీటిని తెచ్చుకోవాల్సిన పరస్థితి ఏర్పడుతోందని ప్రజలు నీటి కోసం అల్లాడిపోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు.

ప్రస్తుత పరిస్థితులతో ఈత చెట్లు చనిపోతుండగా, మొగి పురుగుతో తాటి చెట్లు చనిపోయాయని, అంతేకాకుండా వైన్‌ దుకాణాలు, బెల్ట్‌ దుకాణాలను తట్టుకుని ఉన్న కొద్దిపాటి గీత కార్మికులను కరవు కోలుకోకుండా చేసిందన్నారు. రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునికీకరణ సత్వరమే పూర్తి చేసి కరవు దుర్భిక్ష పరిస్థితుల నుంచి రైతులకు విముక్తి కల్పించాని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+