రేపు మాట్లాడుతాం: కేసీఆర్ విమర్శలపై కోదండరాం స్పందన
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనపై చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం శుక్రవారం స్పందించారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనపై చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం శుక్రవారం స్పందించారు.
తనపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమని చెబితే ఎదురుదాడి చేయడం విడ్డూరమన్నారు.

రేపు జేఏసీ స్టీరింగ్ కమిటీలో సీఎం వ్యాఖ్యలపై చర్చిస్తామని చెప్పారు. కాగా కోదండరాం బాధేంటే అర్థం కావడం లేదని, కాంగ్రెస్ మేనిఫెస్టో రాసిందే అతను అని చెబుతూ కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications