వాళ్లకు, మీకు తేడా ఏంటి: కేసీఆర్‌పై కోదండ సంచలనం, మహిళలు కాళ్లుమొక్కి, ఏడ్చారు

హైదరాబాద్: ఓ వైపు టిఆర్ఎస్ నేతలు తన పైన దుమ్మెత్తి పోస్తున్నప్పటికీ, జేఏసీ చైర్మన్ కోదండరామ్.. కేసీఆర్ ప్రభుత్వం పైన తన మాటలదాడిని ఆపడం లేదు. ప్రభుత్వం రెండేళ్లలో ఏం చేయలేదని సోమవారం నాడు కూడా విమర్శలు గుప్పించారు.

మెదక్ జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్, వేములఘాట్ గ్రామాల్లో ప్రభుత్వం నిర్మించతలపెట్టిన మల్లన్నసాగర్ ప్రాజెక్టు పరిధిలోని గ్రామస్తులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం పైన సంచలన వ్యాఖ్యలు చేశారు.

తోడేళ్లు గొర్రెల మంద మీద పడిన చందంగా తెలంగాణ ప్రభుత్వం భూమిని నమ్ముకున్న రైతుల పైన పడుతోందని విమర్శించారు. ప్రజాభిప్రాయం లేకుండా భూసేకరణ ఎలా చేస్తారని నిలదీశారు. గత పాలకుల బాటలోనే కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందన్నారు.

Kodandaram tours in Medak district and lashes out at KCR

తహశీల్దార్ల పేరిట జరుగుతున్న రిజిస్ట్రేషన్ల పైన ఆయన మండిపడ్డారు. జీవో 123కి వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు. కేవలం యాభై టీఎంసీల నీటి కోసం ఏకంగా 14 ఊర్లను ఖాళీ చేయంచడం ఏమిటని ప్రశ్నించారు. మల్లన్నసాగర్ బాధితులకు అండగా నిలుస్తామన్నారు.

చట్టాలను పక్కన పెట్టి అధికారులు జీవోల ప్రకారం భూ ములు తీసుకుంటామని బెదిరిస్తే ముంపు బాధితులు ఎక్కడకు వెళ్తారని ప్రశ్నించారు. 2013 చట్ట ప్రకారం జలాశయాలు, పరిశ్రమలకు కావాల్సిన భూసేకరణకు గ్రామసభల్లో తీర్మానం చేయాలన్నారు.

కోదండరామ్ మాట్లాడుతూండగా.. కొందరు మహిళలు ఆయన కాళ్ల పైన పడ్డారు. తమ గ్రామాలను రక్షించాలని కన్నీరు కార్చారు. ఈ సందర్భంగా కోదండ మాట్లాడుతూ... అవసరమైతే మేథాపట్కర్‌ను తీసుకు వచ్చి పోరాడుతామని, ఈ విషయమై ప్రభుత్వాన్ని సంప్రదించి న్యాయం చేస్తామన్నారు.

తెరాస లేకుంటే ఐకాస ఎక్కడిది?: హరీష్ రావు

టిఆర్ఎస్ లేకుంటే జేఏసీ ఎక్కడిదని తెలంగాణ భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్ రావు సోమవారం ప్రశ్నించారు. కోదండరాం వ్యాఖ్యలు రాజకీయ దురుద్దేశంతో చేసినట్లు కనిపిస్తున్నాయన్నారు. ప్రతిపక్షాల చేతుల్లోకి వెళ్లి ఇతర ఉద్దేశాలతో ఆయన మాట్లాడుతున్నారన్నారు.

రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కోదండరాంకు కనపడటం లేదా అని ప్రశ్నించారు. కరవు నివారణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రధాని సైతం ప్రశంసించారన్నారు. కోదండరాంను జేఏసీ ఛైర్మన్‌ చేసిందే కేసీఆర్‌ అని హరీష్ రావు అన్నారు. కోదండరామ్ మరో రేవంత్ రెడ్డి కావొద్దని కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+