బాలాపూర్ గణేష్ లడ్డూ రేటెంతో తెలుసా- మైండ్ బ్లాక్

Ganesh Nimajjanam: హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా కొనసాగిన వినాయకుడి నవరాత్రి ఉత్సవాలకు నేటితో తెరపడనుంది. విఘ్న నాయకుడు నిమజ్జనానికి తరలుతున్నాడు. జంటనగరాల్లో కన్నుల పండువగా గణేష విగ్రహాల శోభాయాత్రలు మొదలయ్యాయి. పాతబస్తీ సహా అన్ని ప్రాంతాల్లో నిమజ్జనం వేడుకల సంబరాలు ఆకాశాన్నంటుతున్నాయి.

ఖైరతాబాద్‌లో కొలువుదీరిన సప్తముఖ మహాగణపతి శోభాయాత్ర ఈ తెల్లవారుజామునే ఆరంభమైంది. భారీ క్రేన్ సహాయంతో ఈ 70 అడుగుల మహా విగ్రహాన్ని ట్రాలీపైకి చేర్చారు. అనంతరం ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. మంగళ హారతి ఇచ్చి.. శోభాయాత్రను ప్రారంభించారు.

Kolanu Shankar Reddy gets the Balapur Ganesh Laddu for Rs 30 lakh in an auction

నగరవ్యాప్తంగా వినాయక విగ్రహాల నిమజ్జనం చురుగ్గా సాగుతోంది. రోడ్లన్నీ శోభాయాత్రతో సందడిగా మారాయి. జంటనగరాలన్నీ కాషాయమయం అయ్యాయి. వక్రదంతుడి విగ్రహాలతో కూడిన భారీ ట్రాలీలు, లారీలు, ట్రాక్టర్లతో నిండిపోయాయి. వాటికి ఎక్కడా ఆటంకం కలగకుండా ఇప్పటికే వాహనాలను దారి మళ్లించారు ట్రాఫిక్ పోలీసులు.

నిమజ్జనోత్సవాన్ని తిలకించడానికి లక్షలాది మంది భక్తులు హైదరాబాద్‌కు చేరుకుంటోన్నారు. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్‌ను అధికారులు మూసివేయనున్నారు. ఈ మార్గంలో వాహనాలన్నింటినీ దారి మళ్లించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, జోనల్ కమిషనర్లు, నగర పోలీసులు, ట్రాఫిక్ విభాగం సిబ్బంది ముందుగానే పూర్తి చేశారు.

Kolanu Shankar Reddy gets the Balapur Ganesh Laddu for Rs 30 lakh in an auction

వినాయక నిమజ్జనం అనగానే ఠక్కున గుర్తుకొచ్చే పేరు బాలాపూర్ గణేష్ లడ్డూ. ప్రతి సంవత్సరం కూడా లక్షల రూపాయల్లో ఈ లడ్డూ వేలం పాట సాగుతుంటుంది. వినాయక మండపాల్లో లడ్డూల వేలం పాటల సంప్రదాయానికి తెర తీసింది కూడా బాలాపూర్ గణేష్ మండపమే. ప్రతి ఏటా లక్షల రూపాయల ఆదాయం వస్తుంటుంది ఈ మండపానికి.

ఈ సారి బాలాపూర్ గణేషుడి లడ్డూ 30 లక్షల రూపాయలు పలికింది. వేలంపాటలో దీన్ని కొలన్ శంకర్‌ రెడ్డి దక్కించుకున్నారు. గత సంవత్సరం కంటే ఈ మొత్తం అధికం. 2023 వినాయక నిమజ్జనం సందర్భంగా ఈ లడ్డు 27 లక్షల రూపాయలు పలికింది. అప్పట్లో దాసరి దయానంద్‌రెడ్డి దీన్ని వేలంలో కొనుగోలు చేశారు. ఇప్పుడు అదనంగా మరో మరో మూడు లక్షల రూపాయలు అధికంగా వెళ్లింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+