హైదరాబాద్ టెక్కీని మోసం చేసిన కోల్‌కతా టెక్కీ: డబ్బుతో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
కోల్‌కతా టెక్కీ ఒకతను హైదరాబాద్ టెక్కీని మోసం చేశాడు. అతను ఇచ్చిన డబ్బుతో కోల్‌కతా టెక్కీ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నాడు.
హైదరాబాద్: హైదరాబాద్ టెక్కీని మోసం చేసిన కోల్‌కతా టెక్కీని పోలీసులు అరెస్టు చేశారు. ఓ ప్రముఖ ఐటి కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి కోల్‌కతా టెక్కీ హైదరాబాదీ నుంచి లక్షా 50 రూపాయలు తీసుకున్నాడు. ఆ డబ్బుతో అతను కోల్‌కతాలోని పార్క్ స్ట్రీట్ క్లినిక్‌లో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నాడు.
హైదరాబాదులోని నాగోల్‌కు చెందిన బిటెక్ విద్యార్థి కోల్‌కతా టెక్కీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సుదర్శన్ స్వైన్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీరును ఈ నెల 17వ తేదీన అరెస్టు చేశారు. నిరుడు నవంబర్‌లో ఉద్యోగం కోసం ఆన్‌లైన్‌లో అన్వేషిస్తుండగా హైదరాబాదీకి సుదర్శన్ స్వైన్ ఎదురయ్యాడు. తనను తాను తపన్‌గా చెబుకున్న వ్యక్తికి హైదరాబాదీ తన రెజ్యూమ్ పంపించాడు.

జెన్సార్ టెక్నాలజీస్ లిమిటెడ్‌లో ఉద్యోగం కోసం కాల్ లెటర్ రావడానికి రూ.50 వేలు డిపాజిట్ చేయాలని స్వైన్ చెప్పాడు. ఆ కంపెనీ పేరెన్నిక గన్నది కావడంతో బాధితుడు ఆ డబ్బును డిపాజిట్ చేశాడు. తపన్ అనే వ్యక్తి చెప్పిన బ్యాంకు ఖాతాలో ఆ డబ్బును జమ చేశాడు..
తనను కంపెనీ హెచ్ఆర్ మేనేజర్‌గా చెబుకున్న బాధితుడ్ని టెలిఫోన్‌లో ఇంటర్వ్యూ చేశాడు. ఉద్యోగం పొందడానికి మరో లక్ష రూపాయలు జమ చేయాలని బాధితుడికి అతను చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత బాధితుడికి ఆఫర్ లెటర్ వచ్చింది. దాంతో హైదరాబాదులోని గచ్చిబౌలిలో గల జెన్సార్ టెక్నాలజీస్‌కు బాధితుడు వెళ్లాడు. దాంతో అది ఫోర్జ్ చేసిన ఆఫర్ లెటర్ అని తేలింది.












Click it and Unblock the Notifications