మళ్లీ మళ్లీ చెప్తున్నా, చేతనైతే నా మీద కేసు పెట్టుకో: కేసీఆర్‌కు కోమటిరెడ్డి

అవినీతి ఆరోపణలు చేసి, నిరూపించకుంటే ఆయా శాఖ మంత్రులు కేసులు పెట్టాలని ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానిచండంపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదివారం ఘాటుగా స్పందించారు.

హైదరాబాద్: అవినీతి ఆరోపణలు చేసి, నిరూపించకుంటే ఆయా శాఖ మంత్రులు కేసులు పెట్టాలని ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానిచండంపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదివారం ఘాటుగా స్పందించారు.

ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో అవినీతి ఉందని తాను మళ్లీ పదేపదే చెబుతున్నానని, చేతనైతే తన పైన కేసులు పెట్టాలని ఆయన సీఎం కేసీఆర్‌కు సవాల్ చేశారు.

 Komatireddy challenges TRS government to file case against him

కాంగ్రెస్ పార్టీలో విభేదాలపై ఆయన స్పందించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతి పార్టీలో గొడవలు సహజమని చెప్పారు. తమ పార్టీలోని చిన్న చిన్న గొడవలు త్వరలో సర్దుకుపోతాయన్నారు. అధికార తెరాస పార్టీలో కూడా అంతర్గతంగా విభేదాలు ఉన్నాయని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చాలా బలంగా ఉందని చెప్పారు. త్వరలో హైదరాబాదులో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని చెప్పారు. తమ ప్రభుత్వానికి రైతులు వ్యతిరేకంగా ఉన్నారని తెలిసి, కేసీఆర్ ఎరువుల స్కీం తెరపైకి తెచ్చారని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+