కోమటిరెడ్డి దారెటు..? : కారెక్కుతారా..! కాంగ్రెస్ లోనే కొనసాగుతారా..!

నల్గొండ : ఓవైపు మంత్రి హరీశ్ రావుతో మంతనాలు.. మరోవైపు సొంతపార్టీ కాంగ్రెస్ పై విసుర్లు.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి తాజా రాజకీయ వ్యవహార శైలి చర్చనీయాంశమైన నేపథ్యంలో అసలు ఆయన భవిష్యత్ వ్యూహం ఏంటనేది ఆసక్తికరంగా మారింది.

కాంగ్రెస్ పై ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తూనే పార్టీ మారేది లేదని చెబుతున్న కోమటిరెడ్డి, మరోవైపు అధికార పార్టీతో టచ్ లో ఉన్నానన్న సంకేతాలు కూడా ఇస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే, ఇంతకీ ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగదల్చుకున్నారా..! లేక అధికార పార్టీలోకి అడుగుపెట్టేముందు సొంతపార్టీతో విబేధాలు సృష్టించుకుని తనపై వేటు పడేలా చేసుకోవాలనుకుంటున్నారా..! అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

టీపీసీసీ ఛీఫ్ ను అసమర్థుడు అంటూ.. కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ పార్టీ నుంచి ఆయనకు షోకాజ్ నోటీసులు అందడం, టీపీసీసీ నే పరిగణలోకి తీసుకోనివాడిని ఇక షోకాజ్ నోటీసుల గురించి పట్టించుకుంటానా..! అని తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేయడం వంటివి చూస్తుంటే పార్టీతో ఆయన తెగదెంపులకే సిద్దపడుతున్నారా.. అన్న సందేహాలు తలెత్తకమానవు.

 komatireddy diellemma continuing in congress politics

ఇకపోతే ఇదంతా సీఎం కేసీఆర్ వ్యూహం అని అనేవారు లేకపోలేదు. కాంగ్రెస్ పరువును కాంగ్రెస్ నేతతోనే దెబ్బతీసి ఆ తర్వాత పార్టీలోకి ఆహ్వానించాలనే యోచనలో భాగంగానే కోమటిరెడ్డి రాజకీయ తీరుతెన్నులు ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇవేవి కాకపోతే కాంగ్రెస్ లోనే ఉండి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టీపీసీసీ పగ్గాలు అందుకోవాలని భావిస్తున్నారా..! సోనియాకు లేఖ రాస్తాననడం కూడా ఆ ప్రయత్నంలో భాగమేనా అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లేదు, ఇదేది కాకపోతే పార్టీని వీడడానికే సిద్దపడి, పార్టీ మీద ఉన్న అసంతృప్తినంత వెళ్లగక్కాకే ఆయన కాంగ్రెస్ కు 'గుడ్ బై' చెబుతారా..! అన్న చర్చ కూడా జరుగుతుంది.

ఏదైమైనా.. రాష్ట్రంలో కాంగ్రెస్ కు ఏమాత్రం అనుకూల పరిస్థితులు లేని తరుణంలో అంతో.. ఇంతో.. నల్గొండలో పార్టీ ఉనికిని కాపాడుతున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి నేతలే కాంగ్రెస్ పై తిరగబడే ప్రయత్నం చేస్తే రానున్న రోజుల్లో కాంగ్రెస్ కి మరింత గడ్డు కాలమే ఎదురవ్వొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+