నాకు ఆఫర్ ఇచ్చారు, ఫుటేజీ బయటపెడ్తా: కెటిఆర్‌కు కోమటిరెడ్డి ఝలక్
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కెటి రామారావు విసిరిన సవాల్‌కు కాంగ్రెసు నల్లగొండ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. టిఆర్ఎస్ తలుపలు తట్టీ తట్టీ కుదరక కోమటిరెడ్డి వెనక్కి పోయారని కెటిఆర్ అన్నారు. దానిపై కోమటిరెడ్డ స్పందించారు.
Recommended Video

తన కార్యాలయానికి వచ్చి మంత్రి పదవి ఇస్తానని కెటిఆర్ ఆఫర్ చేశారని, కావాలంటే ఇందుకు సంబంధించిన సిసిటీవీ ఫుటేజీని బయటపెడతానని ాయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

డబ్బు మదంతో కెటిఆర్
డబ్బు మదంతో కేటీఆర్ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. మిషన్ భగీరథలో సగం కాంట్రాక్టులు కెటిఆర్‌కు చెందినవేనని, దోచుకున్న డబ్బును దాచుకునేందుకు తరుచుగా విదేశాలకు వెళ్తున్నారని ఆయన ఆరోపించారు.

కేసీఆర్ చేతగాని తనం వల్లనే...
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేతగాని తనం వల్లనే కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కోమటిరెడ్డి అన్నారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోలేకపోవడం తెలంగాణ ప్రభుత్వ అసమర్థత అని, మోడీని విమర్శించాలంటే భయపడుతున్నారని ఆయన అన్నారు.

కెటిఆర్ సవాల్‌కు సై..
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు అధికారంలోకి వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, కాంగ్రెసు ఓడిపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని కేటీఆర్ అన్నారు. దానిపై కూడా కోమటిరెడ్డి స్పందించారు

ఉత్తమ్‌తో నేను మాట్లాడా.
ఉత్తమ్ కుమార్ రెడ్డితో తాను మాట్లాడానని, కెటిఆర్ సవాల్‌ను స్వీకరిస్తామని చెప్పారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు విజయం సాధించకపోతే ఉత్తమ్‌తో పాటు తాను కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటానని కోమటిరెడ్డి అన్నారు.

కేటీఆర్ మూర్ఖంగా మాట్లాడుతున్నారు
అధికారం ఉందని కేటీఆర్ మూర్ఖంగా మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి అన్నారు. కెటీఆర్ వాడింది మనుషుల భాష కాదని ఆయన అన్నారు. ఎన్నికలకు ముందు తనను టీఆర్ఎస్‌లోకి రావాలని మీరు అడగలేదా అని ఆయన కేటీఆర్‌ను ప్రశ్నించారు. మీరే నా వద్దకు వచ్చారు తప్ప నేను రాలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications