చిత్త‌శుద్ధితో ప‌నిచేస్తా.. న‌న్ను న‌మ్మండి అంటున్న‌ కోమ‌టిరెడ్డి!!

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక‌కు చిత్త‌శుద్ధితో ప‌నిచేస్తాన‌ని, త‌న‌ను న‌మ్మాల‌ని కోరుతున్నారు. ఆయ‌న సోద‌రుడు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి భార‌తీయ జ‌న‌తాపార్టీ తీర్థం పుచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున పాల్వాయి స్ర‌వంతి ఎంపిక‌య్యారు. ఆమె గెలుపు కోసం అంద‌రూ కోమ‌టిరెడ్డి వెంకటరెడ్డివైపు చూస్తున్నారు.

 పాల్వాయిని ప్రతిపాదించిన వెంకటరెడ్డి

పాల్వాయిని ప్రతిపాదించిన వెంకటరెడ్డి


ఎందుకంటే.. పాల్వాయి స్ర‌వంతి అభ్య‌ర్థిగా ఉంటే విజ‌యం సాధించ‌డం సులువ‌ని అధిష్టానం ద‌గ్గ‌ర ప్ర‌తిపాదించింది వెంక‌ట‌రెడ్డే. ఆయ‌న ప్ర‌తిపాద‌న‌కు అధిష్టానం గౌర‌వం ఇచ్చింది. కానీ కాంగ్రెస్ అభ్య‌ర్థి గెలుపుపై పార్టీ నేత‌లు ఏర్పాటు చేసిన స‌మీక్షా స‌మావేశానికి మాత్రం ఆయన గైర్హాజ‌ర‌య్యారు. బ‌య‌ట కోమటిరెడ్డి చేస్తున్న వ్యాఖ్య‌లు అంద‌రినీ అయోమ‌యానికి గురిచేస్తున్నాయి. తన తమ్ముడు రాజ‌గోపాల్‌రెడ్డి గెలుపు కోసం ఆయ‌న రంగం సిద్ధం చేస్తున్నారంటూ విమ‌ర్శ‌లను ఎదుర్కొంటున్నారు.

చల్లమల్లవైపు మొగ్గిన రేవంత్ రెడ్డి

చల్లమల్లవైపు మొగ్గిన రేవంత్ రెడ్డి


అధిష్టానం సీనియ‌ర్ల‌తో మాట్లాడి, స్థానిక నేత‌ల అభిప్రాయాలు సేక‌రించి చివ‌ర‌కు వెంక‌ట‌రెడ్డిప్ర‌తిపాదించిన స్ర‌వంతినే అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించింది. త‌ర్వాత రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వంలో స్ర‌వంతి విజ‌యంకోసం పార్టీ సమావేశం నిర్వహించింది. ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున మునుగోడు ప‌రిధిలోని మండ‌లాల‌కు ఇన్‌ఛార్జిలుగా నియ‌మితులైన‌వారంతా హాజ‌ర‌య్యారుకానీ వెంక‌ట‌రెడ్డి హాజ‌రు కాలేదు. రేవంత్‌రెడ్డి చ‌ల్ల‌మ‌ల్ల కృష్ణారెడ్డిని ప్ర‌తిపాదించిన స‌మ‌యంలో స్ర‌వంతి ఉండాల‌ని ఎంపీ ప‌ట్టుబ‌ట్టారు. ఆమే అభ్యర్థిగా ఉన్నప్పుడు స‌మావేశానికి ఇప్పుడు ఆయ‌న ఎందుకు డుమ్మా కొట్టార‌నేదానిపైనే కాంగ్రెస్ లో చ‌ర్చ న‌డుస్తోంది. ఆయ‌న మ‌న‌సులో ఏముందో అర్థం కాక అంద‌రూ ఎవరికి తోచిన రీతిలో వారు అన్వయించుకుంటున్నారు.

రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం ఒత్తిడి?

రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం ఒత్తిడి?


త‌న త‌మ్ముడు రాజ‌గోపాల్‌రెడ్డి విజ‌యం కోసం అంద‌రూ స‌హ‌క‌రించాలంటూ వెంక‌ట‌రెడ్డి త‌మ‌పై ఒత్తిడి తెస్తున్నారంటూ కాంగ్రెస్ లోని ద్వితీయ శ్రేణి నాయ‌కులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆయ‌న‌పై పార్టీలో ఇంకా అనుమానాలు పెరిగిపోతున్నాయి. వాటిని ఖండించే ప్ర‌య‌త్నం కూడా చేయ‌డంలేదు. ఇంకా మౌనంగానే ఉంటే ప్ర‌జ‌లు అనుమానించాల్సిన ప‌రిస్థితులు వ‌స్తాయ‌ని, వెంట‌నే ఒక ప్ర‌క‌ట‌న ఇవ్వాలంటూ సన్నిహితులు ఆయ‌న‌పై ఒత్తిడి తెస్తున్నారు. నిజంగానే చిత్తశుద్ధితో తనకు ఉన్నతస్థాయిని కట్టబెట్టిన పార్టీ కోసం పనిచేస్తారా? లేదంటే తమ్ముడి విజయం కోసం పనిచేస్తారా? అనేది తెలియాలంటే ఆయన్నుంచి ఒక స్పష్టత వచ్చేవరకు వేచిచూడక తప్పదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+