సిగ్గు శరం లేనోళ్లు..!, రాజీనామా చేసి పోటికి దిగండి, నేను తలపడుతా.. : కోమటిరెడ్డి
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో నల్గొండ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. తాజా పార్టీ ఫిరాయింపులకు తోడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఎటాక్ లతో జిల్లా రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. కాంగ్రెస్ కి గుడ్ బై చెబుతూ రెండు రోజుల క్రితం అధికార పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నట్టు ప్రకటించిన నల్గొండ కాంగ్రెస్ నేతలను ఏకిపారేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
పార్టీ మారిన సందర్భంగా కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు చోటు చేసుకుంటున్నాయని గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తిప్పి కొడుతూ.. ఈ ఏడాది 'జోక్ ఆఫ్ ది ఇయర్' గా గుత్తా కామెంట్ ఉండిపోతుందని ఎద్దేవా చేశారు. అన్నం పెట్టిన పార్టీని వీడిన నేతలకు ఏ మాత్రం నైతికత ఉన్నా..! వెంటనే పదవులకు రాజీనామా చేసి ప్రత్యక్ష ఎన్నికలకు దిగాలని డిమాండ్ చేశారు.
ఒకవేళ గుత్తా సుఖేందర్ రెడ్డి, గుత్తా భాస్కరరావులు రాజీనామా తర్వాత, ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే తాను రాజకీయ సన్యాసానికైనా సిద్దమేనని సవాల్ విసిరారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. పార్టీ మారిన నేతలను సిగ్గు శరం లేనోళ్లుగా దుమ్మెత్తి పోసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సదరు నేతలకు ప్రజలే బుద్ది చెప్పే రోజు చాలా దగ్గరలోనే ఉందని వ్యాఖ్యానించారు.

ఇకపోతే, గుత్తా రాజీనామాకి 'సై' అంటే, అధిష్టానం ఆదేశాల మేరకు ఎంపీ గుత్తాపై పోటీకి తాను సిద్దమని ప్రకటించారు కోమటిరెడ్డి. అంతర్గత కలహాలతోనే పార్టీని వీడుతున్నామని గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పడాన్ని తప్పుబడుతూ.. టీడీపీలో ఉన్నప్పుడు గుత్తా, మోత్కుపల్లి ఎన్నిసార్లు ఒకరినొకరు తిట్టుకోలేదని చెప్పుకొచ్చారు కోమటిరెడ్డి.
కాంగ్రెస్ కి నల్గొండలో మరో షాక్ :
ఇక రాష్ట్ర కాంగ్రెస్ కి నల్గొండ జిల్లా నుంచి షాక్ ల పరంపర కొనసాగుతుంది. తాజాగా డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పాశం రాంరెడ్డి సైతం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. తన రాజీనామా లేఖను పీసీసీ చీఫ్ ఉత్తమ్ కి ఫ్యాక్స్ ద్వారా పంపించారు రాంరెడ్డి.
కాగా, కాంగ్రెస్ కి రాజీనామా చేసిన రాంరెడ్డి బుధవారం నాడు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి టీఆర్ఎస్ లో చేరబోతున్నట్టుగా సమాచారం.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications