Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏఐసీసీ నోటీసుపై సీల్డ్ కవర్‌లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రిప్లై: ఏం చెప్పారంటే?

హైదరాబాద్: ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) ఇచ్చిన షోకాజ్ నోటీసుకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎట్టకేలకు సమాధానం ఇచ్చారు. పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘించి బీజేపీకి ఓటు వేయాలని మునుగోడు కాంగ్రెస్ నాయకులకు ఫోన్ చేసి చెప్పడంపై ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ అక్టోబర్ 22న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీసు ఇచ్చింది.

పది రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. ఈ క్రమంలో నవంబర్ 1న సీల్డ్ కవర్‌లో ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీకి సమాధానం ఇచ్చినట్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.

 Komatireddy Venkat Reddy gives his reply to AICC notice

అది ఫేక్ ఆడియో. ఆ వాయిస్ నాది కాదు. మార్ఫింగ్ చేసింది. పార్టీలో నేను చాలా సీనియర్ నేతను. ఎన్ఐయూఐ విద్యార్థి విభాగం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. గడిచిన 35 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా పని చేస్తున్నాను. నా సీనియార్టీకి పార్టీలో సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సమాధానంలో పేర్కొన్నట్లు తెలిసింది.

కాగా, 15 రోజుల క్రితం మునుగోడుకు చెందిన జబ్బార్ అనే వ్యక్తికి ఫోన్ చేసి తన తమ్ముడికి ఓటు వేయాలని వెంకట్ రెడ్డి సూచించారు. ఇదే ఆడియో బయటకు వచ్చి వైరల్ అయ్యింది. ఆ మరుసటి రోజు వెంకట్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు. మునుగోడు ప్రచారానికి ఆయన వెళ్లలేదు. ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ నోటీసులిచ్చింది. అయితే, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇచ్చిన సమాధానం పట్ల ఏఐసీసీ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+