Venkatreddy: రేవంత్ రెడ్డి అలా అంటే తప్పే.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..!

ఉచిత విద్యుత్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి మాటలు ఆయన వ్యక్తిగతమైనవని అన్నారు. ఆయన చెప్తే ఫైనల్ అవుతుందా? కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుందని వెంకట్ రెడ్డి చెప్పారు. స్టార్ క్యాంపెనర్‌గా తాను చెప్తున్నా 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చి తీరుతామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.

తాను రేవంత్ రెడ్డి కేవలం పార్టీకి కోఆర్డినేటర్స్ మాత్రమేనని చెప్పిన ఆయన సీఎం ఎవరు అనేది పార్టీ నిర్ణయిస్తుందన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని.. మేనిఫెస్టో లో కూడా పెడతామని వెంకట్ రెడ్డి చెప్పారు. రేవంత్ అప్పట్లో కాంగ్రెస్ లో లేరు కాబట్టి ఉచిత విద్యుత్ కోసం ఎంత కష్టపడ్డామో ఆయనకు తెలియదన్నారు. రేవంత్ , కోమటిరెడ్డి లకు మేము ఏం చేస్తాం అనే హక్కు తమకు ఉండదన్నారు.

Komatireddy Venkat Reddy

రేవంత్ ఉచిత కరెంట్ వద్దు అంటే అది తప్పేనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మరోవై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మండిపడుతోంది. మంత్రి జగదీశ్ రెడ్డి రేవంత్ రోడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్ ఇస్తే ఎందకంతా మంట అంటా నిలదీశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే 8 గంటలు మాత్రమే కరెంట్‌ ఇస్తామని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.

గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ దిష్టి బొమ్మలు దహనం చేయాలని సూచించింది. ఉచిత విద్యుత్‌ కార్యక్రమాన్ని రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్‌ పార్టీది అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ నిర్ణయాన్ని తెలంగాణ రైతాంగం, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+