ఇదో మ్యాచ్ ఫిక్సింగ్: కవిత ఇంట్లో ఈడీ సోదాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) సోదాలపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. ఇదంతా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలది మ్యాచ్ ఫిక్సింగ్ అని ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియాని అరెస్ట్ చేసినప్పుడే.. కవితను కూడా అరెస్ట్ చేయాల్సి కదా అని ప్రశ్నించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
ఇప్పుడు కవిత ఇంట్లో ఈడీ సోదాలు చేసి తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు సాధించాలని ప్రయత్నిస్తోందని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం కవిత ఇంట్లో ఈడీ రైడ్స్ డ్రామాలు, ఇదంతా నరేంద్ర మోడీ, అమిత్ షా నాటకమేనని
విమర్శించారు. మోడీ, కేడీని ప్రజలు నమ్మొద్దన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

స్వయంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్.. త్వరలో ఎమ్మెల్సీ కవిత అరెస్టు కాబోతోందని గతంలో చెప్పారని, ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు గల్లీలో కోట్టుకుంటారని, ఢిల్లీలో దోస్తీ అవుతారని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధిపొందడానికి ఇలాంటివి చేస్తున్నారన్నారని కోమటిరెడ్డి దుయ్యబట్టారు.
కవితను అరెస్ట్ చేస్తే బీజేపీకి తెలంగాణలో 3,4 సీట్లు వస్తాయని బీజేపీ ఆలోచిస్తోందని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. కవిత అరెస్ట్ అవ్వడం ఖాయమన్నారు. మరోవైపు, బీఆర్ఎస్ పార్టీపైనా విమర్శలు గుప్పించారు మంత్రి కోమటిరెడ్డి. బీఆర్ఎస్ నుంచి రోజుకో నాయకుడు కాంగ్రెస్, బీజేపీలోకి వెళ్తున్నారు. బీఆర్ఎస్లో చివరికి మిగిలేది ఆ నలుగురు మాత్రమేనని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు.
కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో కవిత ఇంటికి చేరుకున్న ఈడీ అధికారులు దాదాపు మూడు గంటలపాటు సోదాలు చేస్తున్నారు. ఇంట్లోనే కవితతోపాటుగా ఆమె భర్త అనిల్ ఉన్నారు. కవిత ఫోన్లను అధికారులు సీజ్ చేశారు. ఢిల్లీ మద్యం కేసులో ఇప్పటికే పలుమార్లు ఈడీ, సీబీఐ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications