వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్ నన్ను రెచ్చగొట్టద్దు - క్షమాపణ చెప్పాలి : కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరిక..!!

|
Google Oneindia TeluguNews

టార్గెట్ రేవంత్ పాలిటిక్స్ ఊపందుకున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడారు. రేవంత్ పైన వ్యాఖ్యలు చేసారు. దీనికి కౌంటర్ గా పార్టీ వీడిన రాజగోపాల్ పైన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త టర్న్ తీసుకున్నాయి. ఈ వ్యాఖ్యల పైన అనూహ్యంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. రేవంత్ వ్యాఖ్యలను తప్పు బట్టారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడితే..మా బ్రదర్స్ ఇద్దరినీ ఉద్దేశించి రేవంత్ వ్యాఖ్యలు చేయటం బాధ కలిగించిందంటూ వెంకట రెడ్డి పేర్కొన్నారు. అదే సమయంలో రేవంత్ పైన కీలక వ్యాఖ్యలు చేసారు.

రేవంత్ పై కోమటరెడ్డి ఫైర్

రేవంత్ పై కోమటరెడ్డి ఫైర్

రేవంత్ తనను అనుమానించటంతో పాటుగా అవమానించేలా మాట్లాడారని వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత రెడ్డి గారూ..అనవసరంగా నన్ను రెచ్చగొట్టద్దు. వెంటనే క్షమాపణ చెప్పండి అంటూ వెంకటరెడ్డి హెచ్చరించారు. తమను బ్రాందీ షాపులు పెట్టుకొనే వాళ్లమంటూ కామెంట్ చేయటాన్ని ఆయన తప్పుబట్టారు. తాను 34 ఏళ్లుగా కాంగ్రెస్ లో పని చేస్తున్నానని.. తాను కాంగ్రెస్ లో పని చేయటం మొదలు పెట్టే సమయానికి రేవంత్ పుట్టలేదంటూ ఫైర్ అయ్యారు. రేవంత్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారని ధ్వజమెత్తారు.

రేవంత్ రాజీనామా చేయకుండానే

రేవంత్ రాజీనామా చేయకుండానే

ఢిల్లీతో తనతో పాటుగా ఇద్దరు ఎంపీలు ఉన్నా.. కాంగ్రెస్ నిర్వహిస్తున్న ధర్నాలో తాను మినహా వారెవరూ పాల్గొనలేదని చెప్పుకొచ్చారు. తాము ఇంజనీరింగ్ చేసిన తరువాత సొంతంగా వ్యాపారాలు చేసామని..అక్రమంగా సంపాదించలేదని వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. తాను తెలంగాణ కోసం మంత్రి పదవినే వదులుకున్నానని గుర్తు చేసారు. రాజగోపాల్ రెడ్డి మరో జాతీయ పార్టీలోకి వెళ్లాలనుకుంటున్నారని..అది ఆయన ఇష్టమని చెప్పారు. రాజగోపాల్ విషయంలో పార్టీ నాయకత్వం తనతో ఎవరూ చర్చలు చేయలేదని వెంకట రెడ్డి తేల్చి చెప్పారు. రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై తాను ఏం మాట్లాడనని, తాను మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేసారు.

రేవంత్ విజ్ఞతకే వదిలేస్తానంటూ

రేవంత్ విజ్ఞతకే వదిలేస్తానంటూ

చాలా కుటుంబాల్లో వ్యక్తులు వేర్వేరు పార్టీల్లో ఉన్నారనే విషయం గుర్తించాలని సూచించారు. తాను మాత్రం కరడుగట్టిన కాంగ్రెస్‌ వాదినేనని.. ఉమ్మడి కుటుంబంగా పార్టీ ఆదేశాలానుసారం పని చేస్తానని చెప్పారు.అయితే, రేవంత్ వ్యాఖ్యల పైన హైకమాండ కు ఫిర్యాదు చేసే విషయంలో మాత్రం క్లారిటీ ఇచ్చారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు. ఇక, ఇప్పుడు రేవంత్ ఈ వ్యాఖ్యల పైన ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది చూడాలి.

English summary
Congress MP Komaitreddy Venkata Reddy seriously Reacted on TPCC Chief Revanth on his comments against Rajagopal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X