కోమటిరెడ్డీ! నీ రాజకీయ భవిష్యత్తు పోగొట్టుకుంటున్నావ్: కేసీఆర్, వైయస్ పైన..
కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు కోమటిరెడ్డి వెంకట రెడ్డి డబుల్ బెడ్ రూం ఇళ్ల పైన తెలంగాణ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. దీనిపై కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు కోమటిరెడ్డి వెంకట రెడ్డి డబుల్ బెడ్ రూం ఇళ్ల పైన తెలంగాణ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను పూర్తి చేస్తే కాంగ్రెస్ నేతలు పోటీ చేయరని, 50వేల ఇళ్లు పూర్తి చేస్తేనే అద్భుతం అని విమర్శించారు.
దీనిపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీవ్రంగా స్పందించారు. కోమటిరెడ్డి తన రాజకీయ భవిష్యత్తును పోగొట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కొనసాగుతుందని కేసీఆర్ ప్రకటించారు.

అన్ని చోట్ల ఈ నిర్మాణం ప్రారంభమైందన్నారు. 2.60 లక్షల ఇండ్లే కాదని, అంతకు మించి కడతామని చెప్పారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇండ్లను కడతామని చెప్పారు. జనవరి మొదటి వారం వరకు అసెంబ్లీ ఉంటుందని తెలిపారు. హౌసింగ్ కార్పోరేషన్ మూసివేయమని చెప్పారు.
తన క్యాంప్ ఆఫీస్ పైన విమర్శలు చేస్తున్నారని, క్యాంప్ కార్యాలయం అందరికీ చూపించేందుకు తాను సిద్ధమని చెప్పారు. సీఎం క్యాంప్ కార్యాలయం ప్రజల ఆస్తి అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కట్టిన క్యాంప్ కార్యాలయంలో కేవలం సీఎం కారు మాత్రమే పోతుందని, మిగిలిన కాన్వాయ్ అంతా రోడ్డు పైనే అన్నారు.












Click it and Unblock the Notifications