కడియంకు నిలదీత, చెప్పు: పది రోజులుగా జైలులో రైతు కొమురయ్య
వరంగల్: దాదాపు పది రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని నిలదీసిని వరంగల్ జిల్లా రైతు కొమురయ్య సెంట్రల్ జైలులో ఉన్నారు. పత్తి ధర పైన నిలదీస్తే జైల్లో పెట్టారని కుటుంబ సభ్యులు వాపోతున్నారని వార్తలు వస్తున్నాయి.
కొమురయ్య బెయిల్ కోసం తల్లిదండ్రులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కడియం శ్రీహరి వరంగల్ జిల్లాలోని శాయంపేట మండల కేంద్రంలో ఓ రైతు నిలదీసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అతను చెప్పు కూడా విసిరాడు. అతనే కొమురయ్య.
ఇప్పుడు ఆ కొమురయ్య జైలులో ఉన్నారు. పత్తి ధర పైన టిఆర్ఎస్ సర్కార్‌ను ప్రశ్నించినందుకు కొమురయ్యను జైలులో పెట్టారని, అలాగే, బెయిల్ తమ బాధ్యత అని చెప్పిన బిజెపి పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదని అంటున్నారు. కొమురయ్య దాదాపు పదిరోజులుగా జైలులో ఉంటున్నారు.

పత్తి రైతుకు మద్దతు ధర ఇప్పించాలని నిలదీస్తే కొమురయ్య పైన పిచ్చోడు అని ముద్రవేసి, అరెస్టు చేశారని, అతను తెలంగాణ అంటే పడి సచ్చేవాడని, ఇప్పుడు తెలంగాణ సర్కారే అతనిని జైల్లో పెట్టించిందని, పోలీసులు అతనిని వేధిస్తున్నారని కొమురయ్య తల్లి సాంబలక్ష్మి కన్నీరుమున్నీరవుతోంది.
ఈ నెల 6వ తేదీన శాయంపేట శివారు ఆరెపల్లెకు చెందిన కౌలు రైతు కొమురయ్య మద్దతు ధర పైన కడియంను నిలదీశాడు. పత్తికి మద్దతు ధరపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నాడు. గిట్టుబాటు ధర కల్పించడంలో బిజెపి విఫలమైతే టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. అనంతరం చెప్పు విసిరాడు. దీంతో అతనిని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications