వారెవ్వా! 'మీసాల కొమురెల్లి: 100మీ. దూరం మినీ బస్సును లాగిన వైనం

మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని హరిపిరాల గ్రామానికి చెందిన లారీ మెకానిక్‌ ఎర్రబోయిన కొమురెల్లి చిన్నప్పటి నుంచి మీసాలను ఎంతో ఆసక్తితో పెంచుకునే వాడు.

వరంగల్‌: తమ విశిష్టతను చాటుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కొక్కరంగంలో తమ ప్రయత్నాలను కొనసాగిస్తారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని హరిపిరాల గ్రామానికి చెందిన లారీ మెకానిక్‌ ఎర్రబోయిన కొమురెల్లి చిన్నప్పటి నుంచి మీసాలను ఎంతో ఆసక్తితో పెంచుకునే వాడు.

భారీగా మీసాలు చేయాలని సంకిల్పించాడు. మీసాలతో నిత్యం సాహస కృత్యాలు చేపడుతున్నాడు. సోమవారం పట్టణ కేంద్రంలోని ఆర్యభట్ట కాన్సెప్ట్‌ స్కూల్‌లో మీసాలకు తొలుత రెండు కొక్కాలను ఏర్పాటు చేసుకున్నాడు. వాటి సాయంతో బస్సును లాగి అవురా! అనిపించాడు. 100 మీటర్ల దూరం వరకు బస్సును లాగాడు. ఆయన సాహసాన్ని తొర్రూరు ఎస్సై డి రమణమూర్తి, ఆర్యభట్ట కాన్సెప్ట్‌ స్కూల్‌ కరస్పాండెంట్ నెలకుర్తి మధుకర్‌ రెడ్డి అభినందించారు. జ్ఞాపికతో అభినందించారు.

meesala komurelly

సాహసకృత్యాలు చేయడంలో దిట్ట..

కొమురెల్లి పట్టణ కేంద్రంలో లారీ మెకానిక్‌గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి మీసాలను పెంచుకోవడంతో పాటు ప్రత్యేక ఆకృతిలో వాటిని సంరక్షణ కోసం తగిన చర్యలు తీసుకున్నాడు. తొలుత చిన్నచిన్న బరువులను మీసాల సహాయంతో పైకి ఎత్తేవాడు. అలా తొలుత చిన్న గ్యాస్‌ సిలిండర్‌ను పైకి ఎత్తాడు. ఈ క్రమంలో ఇబ్బందులు ఎదురొన్నప్పటికీ పట్టు వీడని విక్రమార్కుడిగా భారీ బరువులను ఎత్తాలని సంకల్పించాడు.

నిండు పెద్ద గ్యాస్‌ సిలిండర్లను సైతం పైకి ఎత్తాడు. రెండు కార్లను సైతం మీసాలకు కొక్కాలు ఏర్పాటు చేసుకొని 100 మీటర్లు వరకు లాగాడు. గిన్నిస్ బుక్‌లో చోటు దక్కే వరకు మీసాల ద్వారా సాహసాలు కొనసాగిస్తానని కొమురెల్లి మీడియాకు తెలిపాడు. త్వరలో లారీ, బస్సును లాగుతానని తెలిపారు. గిన్నిస్‌బుక్‌లో చోటు దక్కే వరకు ప్రయత్నిస్తానని ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+