టీఆర్ఎస్‌కు షాకిస్తారా?: సొంత గూటికి కొండా సురేఖ!, ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ
Recommended Video

హైదరాబాద్: వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండా సురేఖకు టీఆర్ఎస్ మొదటి జాబితాలో అవకాశం దక్కకపోవడంతో అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలో కొండా దంపతులు పార్టీ మారుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
అంతేగాక, వారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో రెండు టికెట్లు అడుగుతున్నారని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖాయమైందన్న చర్చ నడుస్తోంది.

కొండా దంపతుల కుమార్తె సుస్మితా పటేల్‌తో పాటు సురేఖకు టికెట్ కావాలని కేసీఆర్‌ను వారు అడిగినట్లు తెలిసింది. అయితే, సురేఖ లేదా సుస్మితా పటేల్ ఎవరో ఒక్కరికి మాత్రమే టికెట్ ఇస్తామని కేసీఆర్ స్పష్టం చేశారట. ఈ నేపథ్యంలోనే మొదటి జాబితాలో సురేఖకు అవకాశం దక్కలేదనే వాదనలున్నాయి.
ఈ క్రమంలో కొండా సురేఖ శనివారం ప్రెస్ మీట్ పెడుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ మీడియా సమావేశంలో కొండా సురేఖ టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతారా? లేక సొంత పార్టీ అయిన కాంగ్రెస్‌లోకి చేరతానంటూ ప్రకటన చేస్తారా? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications