కేటీఆర్‌తో భేటీ: సోలార్ ప్లాంట్, ఉచిత శిక్షణ(ఫోటోలు)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 200 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు టాటా గ్రూప్ సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు టాటా గ్రూప్ కంపెనీలతో ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి టాటా గ్రూప్‌లోని టాటా క్యాపిటల్, రిటైల్, ప్రాజెక్టు, ఆటోమొబైల్, డిఫెన్స్, కాఫీ, హౌసింగ్ తదితర విభాగాల ప్రతినిధులు హాజరయ్యారు. మంత్రి మహేందర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.
సోలార్ పవర్‌పాటు బయోమాస్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు సైతం ఇప్పటికే సంసిద్ధత వ్యక్తంచేయడంతోపాటు తమ బృందం పలు ప్రాంతాల్లో పర్యటించిన విషయాన్ని టాటా బృందం మంత్రి కేటీఆర్‌కి వివరించింది. ఈ సమావేశంలో విద్యుత్ ప్లాంట్ల కోసం సాధ్యమైనంత త్వరగా భూ సేకరణ పూర్తిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు.

వృత్తి విద్య విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు ప్రభుత్వం చర్యలు
ఈ సమావేశానికి టాటా గ్రూప్‌లోని టాటా క్యాపిటల్, రిటైల్, ప్రాజెక్టు, ఆటోమొబైల్, డిఫెన్స్, కాఫీ, హౌసింగ్ తదితర విభాగాల ప్రతినిధులు హాజరయ్యారు. మంత్రి మహేందర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.

వృత్తి విద్య విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు ప్రభుత్వం చర్యలు
తెలంగాణ ఐటీ శాఖ ఏర్పాటు చేస్తున్న టీ హబ్‌లో టాటా క్యాపిటల్ ద్వారా భాగస్వామ్యం అయ్యేందుకు సానుకూలంగా ఉందని, త్వరలో టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ సూచించిన బృందం హైదరాబాద్ వస్తుందని మంత్రి తెలిపారు.

వృత్తి విద్య విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు ప్రభుత్వం చర్యలు
టాటా ఆటోమైబైల్, టాటా కాఫీల విస్తరణ అవకాశాలపై చర్చించినట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమ వర్గాలతో వ్యవహరిస్తున్న తీరు, స్పందిస్తున్న విధానం పట్ల టాటా గ్రూప్ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు.

వృత్తి విద్య విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు ప్రభుత్వం చర్యలు
రాష్ట్రంలో ఇంజినీరింగ్ పట్టభద్రులను కాకుండా ఇంజినీరింగ్ ఉద్యోగులను సృష్టించేందుకు కృషి చేస్తున్నట్లు ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో ఇంజినీర్ కావడం చాలా సులభంగా మారిందని, కానీ రాసికన్నా వాసి ముఖ్యమని తాము బలంగా నమ్ముతున్నామని తెలిపారు. అందుకే వృత్తివిద్య విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు.

వృత్తి విద్య విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు ప్రభుత్వం చర్యలు
ప్రభుత్వం ఏర్పాటుచేసిన తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) సంస్థ.. నాస్కాం సంస్థ, జేఎన్టీయూలతో కేటీఆర్ సమక్షంలో మంగళవారం ఎంఓయూ కుదుర్చుకుంది. సైబర్ సెక్యూరిటీ, డాటా అనలిటిక్స్, డిజైన్ ఇంజినీరింగ్‌లో 15,000మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తామని చెప్పారు. ఈ శిక్షణకు నాస్కాం ఫీజు వసూలు చేయదు.

వృత్తి విద్య విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు ప్రభుత్వం చర్యలు
కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, ఐటీ కార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్, నాస్కాం వైస్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, జేఎన్టీయూ వీసీ శైలజా రామయ్యార్, రిజిస్ట్రార్ రమణారావు, రెక్టార్ కిషన్, టాస్క్ ప్రతినిధి సుజీవ్‌నాయర్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications