వరంగల్ ఎన్నికపై ప్రభావం ఉంటుందా? నితీష్‌కు కెటిఆర్ అభినందన, మజ్లిస్‌కు బీహార్లో ఓట్లు
హైదరాబాద్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఎన్డీయే సమీక్షించుకోవాల్సి ఉందని తెలంగాణ టిడిపి అధ్యక్షులు ఎల్ రమణ ఆదివారం అన్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఫలితాలు వచ్చాయన్నారు.
బీహార్ ఎన్నికల ప్రభావం వరంగల్ ఉప ఎన్నిక మీద ఏమాత్రం ఉండబోదని చెప్పారు. బిహార్‌లో బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించపోవడం ఫలితాలపై ప్రభావం చూపిందని ఎల్ రమణ అభిప్రాయపడ్డారు.
మోడీ వైఫల్యం: అసదుద్దీన్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఓడిపోవడం ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యత వహించాలని మజ్లిస్ పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. సీమాంచల్ ప్రాంతంలో మజ్లిస్ పార్టీ సభ్యులకు ఓట్లు వేసిన ప్రజలకు అసదుద్దీన్ ధన్యవాదాలు అన్నారు. వచ్చే ఎన్నికల సమయానికి బీహార్‌లో మజ్లిస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు.

నితీష్‌కు కెటిఆర్ అభినందనలు
అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధించడంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పందించారు. ఆయన నితీష్ కుమార్‌కు అభినందనలు తెలిపారు. ఎన్డీయే లోటుపాట్లను సరి చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
గాంధీ భవన్లో మిఠాయిలు పంచుకొని, టపాసులు పేల్చారు
బీహార్లో మహా కూటమి గెలుపు నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు గాంధీ భవన్లో టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ... ప్రధాని ప్రతిష్టను మోడీ దిగజార్చారన్నారు. బీహార్లో బిజెపి చీఫ్ అమిత్ షా వ్యాఖ్యలు ఆ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications